కుప్పంలో చంద్రబాబుకు వచ్చే మెజార్టీ ఇదేనా? లెక్క తప్పదంటున్న టీడీపీ

ఈసారి వైసీపీ సైతం కుప్పం నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. టీడీపీకి ధీటుగా ప్రచారం నిర్వహించి గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నించింది. అంతేకాదు కుప్పంలో గెలిస్తే చంద్రమౌళికి మంత్రి పదవి ఇస్తానని జగన్ ప్రకటించడం విశేషం.

news18-telugu
Updated: April 23, 2019, 3:54 PM IST
కుప్పంలో చంద్రబాబుకు వచ్చే మెజార్టీ ఇదేనా? లెక్క తప్పదంటున్న టీడీపీ
చంద్రబాబు
news18-telugu
Updated: April 23, 2019, 3:54 PM IST
ఏపీ ఎన్నికల ఫలితాలపై ఇటు పార్టీలు, అటు జనాల్లో ఉత్కంఠ నెలకొంది. రోజులు గడిచే కొద్దీ అభ్యర్థుల్లో అంతకంతకూ టెన్షన్ పెరుగుతోంది. గెలుస్తామా? లేదా? అని ఎవరికి వారు లెక్కలేసుకుంటున్నారు నేతలు. బూత్‌ల వారీగా ఓట్ల అంచనాలు వేసుకుంటూ గెలుపోటములపై విశ్లేషించుకుంటున్నారు. ఐతే ఈసారి కుప్పంలో సీఎం చంద్రబాబునాయుడు ఎంత మెజార్టీతో గెలవబోతున్నారన్న దానిపైనా టీడీపీలో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో మంగళవారం నియోజకవర్గాల వారీగా పార్టీ నేతలతో చంద్రబాబు సమావేశమైన సందర్భంగా 'కుప్పంలో మెజార్టీ' అంశం ప్రస్తావనకు వచ్చింది.

గత ఎన్నికలతో పోలిస్తే చంద్రబాబు మెజార్టీ భారీగా పెరుగుతుందని తెలుగు తమ్ముళ్లు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఈసారి కనీసం 79వేల మెజార్టీతో గెలవడం ఖాయమని పార్టీ అధినేతకు వివరించారు. ఏదో కాకి లెక్కలు చెప్పకుండా..పోలింగ్ బూతుల వారీగా ఆధిక్యం వివరాలను అందజేశారు. టీడీపీకి పోలయ్యే ఓట్ల అంచనాలను సిద్ధం చేసి జాబితా రూపొందించారు. ఆ తర్వాతే కుప్పంలో రాబోయే మెజార్టీ అంచనావేశారు తెలుగు తమ్ముళ్లు. ఈ నేపథ్యంలో ఇతర నియోజకవర్గాల్లోనూ ఖచ్చితంగా టీడీపీకి పడే ఓట్ల వివరాలతో జాబితాలను రూపొందించాలని నేతలకు సూచించారు చంద్రబాబు.

2014 ఎన్నికల్లో చంద్రబాబు 47,121 మెజార్టీతో గెలిచారు. చంద్రబాబుకు 1,02,952 ఓట్లు పోలవగా.. వైసీపీ అభ్యర్థి చంద్రమౌళికి 55,839 ఓట్లు పడ్డాయి. ఐతే ఈసారి వైసీపీ సైతం కుప్పం నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. టీడీపీకి ధీటుగా ప్రచారం నిర్వహించి గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నించింది. అంతేకాదు కుప్పంలో గెలిస్తే చంద్రమౌళికి మంత్రి పదవి ఇస్తానని జగన్ ప్రకటించడం విశేషం. ఎవరి అంచనాలు ఎలా ఉన్నా మే 23న ఫలితాలు వెల్లడవుతాయి. మరి ఎవరు గెలుస్తారు? ఎంత మెజార్టీ వస్తుంద్నది ఆ రోజే తెలుస్తుంది.

First published: April 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...