హోమ్ /వార్తలు /National రాజకీయం /

ప్రత్యక్ష ఎన్నికల బరిలో నారా లోకేశ్...నాయకుడిగా తొలి అగ్ని పరీక్ష

ప్రత్యక్ష ఎన్నికల బరిలో నారా లోకేశ్...నాయకుడిగా తొలి అగ్ని పరీక్ష

AP Elections 2019 | టీడీపీ నాయకుడిగా, మంత్రిగా బ్యాక్ డోర్ ఎంట్రీ సాధించారని రాజకీయ ప్రత్యర్థుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న మంత్రి నారా లోకేశ్‌‌కి ఈ ఎన్నికలు అగ్ని పరీక్ష కానున్నాయి. నాయకుడిగా నిరూపించుకోవాలంటే మంగళగిరిలో లోకేశ్ గెలిచితీరాల్సిందే.

AP Elections 2019 | టీడీపీ నాయకుడిగా, మంత్రిగా బ్యాక్ డోర్ ఎంట్రీ సాధించారని రాజకీయ ప్రత్యర్థుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న మంత్రి నారా లోకేశ్‌‌కి ఈ ఎన్నికలు అగ్ని పరీక్ష కానున్నాయి. నాయకుడిగా నిరూపించుకోవాలంటే మంగళగిరిలో లోకేశ్ గెలిచితీరాల్సిందే.

AP Elections 2019 | టీడీపీ నాయకుడిగా, మంత్రిగా బ్యాక్ డోర్ ఎంట్రీ సాధించారని రాజకీయ ప్రత్యర్థుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న మంత్రి నారా లోకేశ్‌‌కి ఈ ఎన్నికలు అగ్ని పరీక్ష కానున్నాయి. నాయకుడిగా నిరూపించుకోవాలంటే మంగళగిరిలో లోకేశ్ గెలిచితీరాల్సిందే.

ఇంకా చదవండి ...

  ఏపీలో జరగనున్న ఎన్నికలు రాజకీయంగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడితో పాటు ఆయన తనయుడు, మంత్రి నారా లోకేశ్‌కు కూడా అత్యంత ప్రతిష్టాత్మకం కానున్నాయి. తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలుస్తున్న ఆయన భవితవ్యాన్ని తేల్చనున్నాయి ఈ ఎన్నికలు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయ వారసుడిగా తెరపైకి వచ్చిన లోకేశ్‌కు ఓ రకంగా అగ్ని పరీక్ష కానున్నాయి. 36 ఏళ్ల నారా లోకేశ్‌ని ఇప్పటికీ చాలా మంది తండ్రి చాటు తనయుడిగానే పరిగణిస్తున్నారు. నాలుగు దశాబ్ధాల చరిత్ర కలిగిన టీడీపీలో సీనియర్ నేతలకు కొదవలేదు. అయితే పార్టీలో ప్రస్తుతం నెం.2 స్థానం నారా లోకేశ్‌దేనని ఆ పార్టీలోని నాయకులందరూ అంగీకరిస్తున్నారు.

  ఎమ్మెల్సీ పదవితో 2017లో చంద్రబాబు కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు నారా లోకేష్. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలుస్తాడన్న నమ్మకం లేకే...అడ్డదారిలో నారా లోకేష్‌ను కేబినెట్‌లోకి తీసుకున్నారని రాజకీయ ప్రత్యర్థులు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ విమర్శలకు తిప్పికొట్టేందుకు  ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలుస్తున్నారాయన.   రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలను వడపోసిన తర్వాత...వచ్చే ఎన్నికల్లో కొత్త రాజధాని పరిధిలోని మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నారా లోకేష్‌ని బరిలో నిలపాలని టీడీపీ నిర్ణయించింది. ఈ ఎన్నికల్లో గెలుపొంది శాసనసభలో అడుగుపెట్టడం ద్వారా...నాయకుడిగా తన సత్తా చాటాలని నారా లోకేశ్ ఉవ్విళ్లూరుతున్నారు.

  ap assembly,ap news,ap assembly elections 2019,ap elections 2019,ap politics,ap assembly live,ap assembly 2019,ap aseembly,ap assembly today,ap assembly fights,ap,ap assembly elections,ap assembly today live,ys jagan in ap assembly,ap assembly election 2019,ap assembly sessions live,ap assembly last sessions live,ap assembly sessions 2019 live,ap cm,ap political news,nara lokesh,nara lokesh comedy,minister nara lokesh,nara lokesh speech,nara lokesh tongue slip,nara lokesh tongue slips,nara lokesh to contest from mangalagiri,lokesh,tdp nara lokesh,nara lokesh news,nara lokesh funny,nara lokesh telugu,నారా లోకేష్,చంద్రబాబు,మంగళగిరి,ఏపీ అసెంబ్లీ ఎన్నికలు,ఎమ్మెల్సీ నారా లోకేష్,
  నారా లోకేష్ (File)

  అమెరికాలోని స్టాన్‌ఫర్డు యూనివర్సిటీలో ఎంబీఏ చేసిన నారా లోకేశ్...దేశానికి తిరిగొచ్చాక కొంతకాలం కుటుంబ వ్యాపారాల్లో తలమునకలయ్యారు. హెరిటేజ్ ఫుడ్స్‌కు మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆయన వ్యవహరించారు. 2009 నుంచి నారా లోకేశ్ టీడీపీ వ్యవహారాల్లో తెరవెనుక నుంచి పని మొదలుపెట్టారు. తెలుగుదేశం పార్టీ 2009 మానిఫాస్టోలో చేర్చిన కాష్ ట్రాన్స్‌ఫర్ స్కీము నారా లోకేశ్ ఐడియాగా టీడీపీ నేతలు చెబుతారు. 2013 మేలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న ఆయన...తెలుగుదేశం యువజన విభాగానికి నాయకత్వం వహించాడు. పార్టీలో లోకేశ్ ప్రవేశంతో పాటు 2017 మార్చిలో ఎమ్మెల్సీగా ఎన్నికై...ఆ తర్వాత కొంతకాలానికే చంద్రబాబు కేబినెట్‌లో చేరడం వరకు అంతా ‘బ్యాక్ డోర్‌’లో జరిగిందని రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు చేశారు. నారా లోకేశ్ రాజకీయ భవితవ్యం కోసమే 2009 ఎన్నికల ప్రచారంలో సేవలందించిన జూనియర్ ఎన్టీఆర్‌ను చంద్రబాబు కరివేపాకులా వాడుకుని పక్కన పడేశారన్న రాజకీయ విమర్శలు కూడా ఉన్నాయి.

  Nara lokesh contest in bheemili, Bheemili, AP minister Ganta Srinivasa Rao, Vishakapatnam loksabha, TDP, Chandrababu Naidu, నారా లోకేశ్, ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు, విశాఖపట్నం లోక్ సభ, నందమూరి బాలకృష్ణ, టీడీపీ, చంద్రబాబునాయుడు
  నారా లోకేశ్, చంద్రబాబు

  2015లో పార్టీ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేశ్‌ ప్రమోట్ కావడంతో టీడీపీలో చంద్రబాబు తర్వాత రెండో స్థానం ఆయనదేనని తేలిపోయింది. తన రాజకీయ వారసుడిగా నారా లోకేశ్‌ని తెరమీదకు తీసుకొచ్చి పార్టీ నేతల ఆమోదం పొందడంలో చంద్రబాబు సఫలీకృతమయ్యారు. పార్టీ నేతల ఆమోదం పొందిన నారా లోకేశ్ ఇప్పుడు ప్రజామోదం కోసం ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. మంగళగిరి శాసనసభ నుంచి గెలిచి...నాయకుడిగా తనను నిరూపించుకోవాలని భావిస్తున్నారు.

  అయితే మంగళగిరిలో గెలుపు నారా లోకేష్‌కి నల్లేరుపై బండి నడక కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక్కడ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్లగడ్డ రామకృష్ణా రెడ్డి నుంచి యువనేతకు గట్టి పోటీ ఎదురుకానుంది. 2014 ఎన్నికల్లో స్వల్ప ఓట్ల ఆధిక్యంతో ఆర్కే ఇక్కడ విజయం సాధించగా...వచ్చే ఎన్నికల్లో నారా లోకేశ్‌ను ఇక్కడ ఢీకొట్టనున్నారు.

  First published:

  Tags: Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Chandrababu Naidu, Guntur, Jr ntr, Lok Sabha Election 2019, Nara Lokesh, TDP

  ఉత్తమ కథలు