పవన్‌ను నమ్ముకుంటే అత్తారింటికి.. జగన్‌కు ఒక్క ఛాన్స్ ఇస్తే... : చంద్రబాబు సెటైర్లు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోదీ మీద చంద్రబాబు విరుచుకుపడ్డారు.

news18-telugu
Updated: April 2, 2019, 2:59 PM IST
పవన్‌ను నమ్ముకుంటే అత్తారింటికి.. జగన్‌కు ఒక్క ఛాన్స్ ఇస్తే... : చంద్రబాబు సెటైర్లు
చంద్రబాబు, పవన్ కల్యాణ్, జగన్,
  • Share this:
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను నమ్ముకుంటే అత్తారింటికి వెళ్లడమేనని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎద్దేవా చేశారు. తనను నమ్ముకుంటే భవిష్యత్ బ్రహ్మాండంగా ఉంటుందన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోదీ మీద చంద్రబాబు విరుచుకుపడ్డారు. ఒక్కసారి తనకు ఛాన్స్ ఇవ్వాలని అడుగుతున్న జగన్ మోహన్ రెడ్డిపై కూడా సెటైర్లు వేశారు. ఒక్కసారి అధికారం ఇవ్వడానికి ఇదేమైనా చాక్లెట్టా? అని చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. అలాగే, ఒక్కసారే కదా అని ఎవరైనా లోయలో దూకుతారా? అని ప్రశ్నించారు. ఒక్కసారే కదా అని తినే భోజనంలో విషం కలుపుకొంటామా? అని చంద్రబాబు ప్రజలను ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డికి రాష్ట్రాన్ని అప్పగిస్తే ఆంధ్రప్రదేశ్ అధోగతి పాలు కావడం ఖాయమన్నారు. జగన్ మోహన్ రెడ్డి కావాలంటే సినిమావాళ్లకు, కేసీఆర్‌‌కు ఊడిగం చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. కేసీఆర్, నరేంద్ర మోదీ నుంచి జగన్‌కు డబ్బులు వస్తున్నాయని చంద్రబాబు ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ కరుడుగట్టిన ఉగ్రవాది అని సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రానికి అన్యాయం చేయడమే కాకుండా ఓట్ల దొంగలను కాపాడారని విమర్శించారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కేంద్రం పరిధిలోకి తీసుకురావడానికి కూడా ప్రయత్నించారని చంద్రబాబు ఆరోపించారు.
First published: April 2, 2019, 2:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading