ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో టీడీపీకి మైండ్ బ్లాంక్ అయింది. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాంటి ఘోర పరాజయాన్ని ఇప్పటి వరకు ఎప్పుడూ చూడలేదు టీడీపీ. 175 నియోజకవర్గాల్లో కనీసం 25 సీట్లు కూడా దక్కని పరిస్థితి నెలకొంది. ఇదే పెద్ద షాక్ అనుకుంటే పార్టీలో రెండు పెద్ద కుటుంబాలైన నందమూరి, నారా కుటుంబాలకు కూడా తలెత్తుకోలేని ఘోర పరాభవం ఎదురైంది. 14 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబునాయుడి ఏకైక కుమారుడు, ఆయన వారసుడు అయిన నారా లోకేష్ మంగళగిరిలో ఓటమి పాలయ్యారు. మంగళగిరిలో నారా లోకేష్ మీద వైసీపీ అభ్యర్ధి ఆళ్ల రామకృష్ణారెడ్డి విజయం సాధించారు. కుప్పంలో కూడా మొదటి రెండు రౌండ్లలో వైసీపీ అభ్యర్థి చంద్రమౌళి.. చంద్రబాబు మీద ఆధిక్యంలోకి వచ్చారు. ఇది రాజకీయవర్గాల్లో సంచలనం సృష్టించింది. అయితే, చంద్రబాబు 30వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించారు.
ఇక నందమూరి హీరో బాలకృష్ణ గట్టి పోటీ ఎదుర్కోవాల్సి వచ్చింది. హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన బాలకృష్ణతో విజయం చివరి వరకు దోబూచులాడింది. చివరకు, వైసీపీ అభ్యర్థి ఇక్బాల్ మీద 17వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. అయితే, ఆయన అల్లుళ్లు ఇద్దరు పరాజయం చెందడం బాలయ్య, నందమూరి అభిమానులు జీర్ణించుకోలేని అంశం. నారా లోకేష్ మంగళగిరి అసెంబ్లీలో ఓడిపోతే, శ్రీభరత్ విశాఖపట్నం లోక్సభ స్థానంలో పోటీ చేసి ఓడిపోయారు. బాలయ్య సోదరి దగ్గుబాటి పురందేశ్వరి కూడా విశాఖపట్నంలో బీజేపీ తరఫున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.