AP ELECTION RESULT 2019 LIVE UPDATES YSRCP GETS LANDSLIDE VICTORY IN ANDHRA YS JAGAN WILL TAKE OATH ON MAY 30TH BA
AP Election results: వైసీపీ 150, టీడీపీ 24, జనసేన 1
చంద్రబాబు, వైఎస్ జగన్ (File)
ఫలితాలు విడుదల కావడంతో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటుకు రూట్ క్లియర్ అయింది. ఈనెల 30న విజయవాడలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ప్రతిపక్ష వైసీపీ ప్రభంజనం సృష్టించింది. రాష్ట్రంలో ఫ్యాన్ గాలి సునామీలా వీచింది. ఆ సునామీలో అధికార టీడీపీ కొట్టుకుపోయింది. ఒక్క జిల్లా, ఒక్క ప్రాంతం అని కాకుండా, ప్రతి జిల్లాలోనూ వైసీపీ హవా కొనసాగింది. కొన్ని జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ కూడా చేసింది. మూడో ప్రత్యామ్నాయంగా ప్రజల ముందుకు వచ్చిన జనసేన పార్టీ కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. ఏకంగా పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో వైసీపీ 150 అసెంబ్లీ సీట్లు గెలుచుకుంది. టీడీపీకి 24 సీట్లు దక్కాయి. జనసేన పార్టీ ఒక్క చోట మాత్రమే గెలిచింది.
లోక్సభ స్థానాల్లో కూడా వైసీపీ హవా కొనసాగింది. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 25 లోక్సభ సీట్లు ఉన్నాయి. అందులో 22 స్థానాల్లో వైసీపీ గెలుపొందింది. మూడు సీట్లలో మాత్రమే విజయం సాధించింది. టీడీపీకి కంచుకోటలు అయిన లోక్సభ నియోజకవర్గాల్లో కూడా వైసీపీ జెండా ఎగరేసింది.
ఫలితాలు విడుదల కావడంతో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటుకు రూట్ క్లియర్ అయింది. ఈనెల 30న విజయవాడలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. మే 24న వైఎస్ జగన్ ఇడుపులపాయ వెళ్లి.. తన తండ్రి వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళి అర్పిస్తారు. ఈనెల 25న విజయవాడలో వైసీపీఎల్పీ సమావేశం జరగనుంది. ఆ సమావేశంలో జగన్ మోహన్ రెడ్డిని సీఎల్పీ నేతగా ఎన్నుకుంటారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.