ఏపీలో జోరుగా కౌంటింగ్ ఏర్పాట్లు... మొదటి ఫలితం వచ్చేది అక్కడే ?

ఈవీఎం, వీవీప్యాట్ (File)

మరోవైపు ఇప్పటికే ఎన్నికల కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ ప్రారంభించారు అధికారులు.పోలింగ్ కేంద్రంలో కౌంటింగ్ ప్రక్రియపై ఒక ఈవీఎం చొప్పున 14 టేబుళ్లలో 14 ఈవీఎంలను ఒకేసారి లెక్కిస్తారు.

  • Share this:
    ఏపీలో ఎన్నికల ఫలితాలకు ఇంకా కొన్నిరోజులే సమయం ఉంది. దీంతో ఎన్నికల అధికారులు కౌంటింగ్ ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఫలితాల ప్రకటన నేపథ్యంలో... ఈనెల 23న జరిగే ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను చక చక చేసేస్తున్నారు. ఇటు రాజకీయ నేతలు కూడా ప్రత్యేకంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియపై దృష్టి పెట్టారు. అయితే ఇప్పుడు ఏపీలో మొదటి ఫలితం వచ్చేది ఏ నియోజకవర్గమన్నదానిపై జోరుగా చర్చ జరుగుతోంది. అయితే అనంతపురం జిల్లా నుంచే మొదటి ఫలితం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓట్ల సంఖ్యను బట్టే ఈ ఫలితాల వెల్లడికి ఛాన్స్ ఉంటుంది. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో తక్కువ ఓట్లు ఉన్నాయి. దీంతో మొదటి రిజల్ట్ ఇక్కడే వస్తుందని అధికారులు, రాజకీయ నేతలు అంచనా వేస్తున్నారు.ఇక ఇదే జిల్లాలోని రాప్తాడు,రాయదుర్గం ఫలితాలు చివర్లో వెల్లడవుతాయని అనుకుంటున్నారు.

    మరోవైపు ఇప్పటికే ఎన్నికల కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ ప్రారంభించారు అధికారులు. అనంతపురం పార్లమెంటు నియోజకవర్గంతోపాటు దాని పరిధిలోని అనంతపురం అర్బన్‌, తాడిపత్రి, శింగనమల, గుంతకల్లు, కళ్యాణదుర్గం, రాయదుర్గం, ఉరవకొండ అసెంబ్లీ స్థానాలకు జేఎన్‌టీయూలో ఓట్లు లెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హిందూపురం పార్లమెంటు నియోజకవర్గంతోపాటు ఆ పరిధిలోని హిందూపురం, మడకశిర, పెనుకొండ, రాప్తాడు, కదిరి, ధర్మవరం, పుట్టపర్తి నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు శ్రీ కృష్ణా యూనివర్శిటీలో ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రంలో కౌంటింగ్ ప్రక్రియపై ఒక ఈవీఎం చొప్పున 14 టేబుళ్లలో 14 ఈవీఎంలను ఒకేసారి లెక్కిస్తారు. సిబ్బంది అంతా ఉదయం 4 గంటలకే కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు ఆదేశించారు. చివరి ఓటు లెక్కించే వరకు ఎవరూ బయటకు వెళ్లకూడదన్నారు. మొత్తం మీద కౌంటింగ్‌కు రోజులు దగ్గరపడుతున్న కొద్దీ ... ఇటు ఎన్నికల అధికారులతో పాటు.. అటు రాజకీయ నేతల్లోనూ టెన్షన్ పెరిగిపోతుంది.
    First published: