news18-telugu
Updated: May 20, 2019, 2:00 PM IST
వైఎస్ జగన్(ఫైల్ ఫోటో)
సార్వత్రిక ఎన్నికలు ముగిసి, ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎన్డీయేకు పట్టం కట్టడంతో కేంద్రంలో ఎవరితో జట్టు కట్టాలనేదానిపై వైసీపీకి క్లారిటీ వచ్చేసినట్లుంది. ఎన్డీయే కూటమికి 300కి పైగా సీట్లు వస్తాయని దాదాపు అన్ని సర్వేలు తేల్చేశాయి. యూపీఏ కూటమి, ప్రతిపక్షాలు ఘోర పరాజయాన్ని చవి చూస్తాయని పేర్కొన్నాయి. లగడపాటి సర్వే, ఇతర రెండు సర్వేలు మినహా దాదాపు అన్ని సర్వేలు ఏపీలో జగన్ పార్టీదే అధికారం అని, ఆ పార్టీయే ఎక్కువ లోక్సభ సీట్లను గెలుచుకుంటుందని స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకే మద్దతు పలికే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయ్ సాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలే ఉదాహరణగా నిలుస్తున్నాయి.
ఈ రోజు ఆయన ట్విట్టర్ వేదికగా.. ‘యూపీఏ, మాయా-అఖిలేశ్ ఫ్రంటులు చతికల పడ్డాయి. చంద్రబాబు గ్రాఫ్ ఢమాల్ అన్న విషయం కూడా వాళ్లకి అర్థమైంది. లగడపాటి సర్వేను అందరికీ చూపించబోగా విసుక్కున్నారట. పాపం అటు ఇటు కాకుండా పోయాడు బాబు’ అని ట్వీట్ చేశారు. అంటే.. యూపీఏతో జట్టు కట్టేది లేదని ఆయన చెప్పకనే చెబుతున్నట్లుగా స్పష్టమవుతోంది.
Published by:
Shravan Kumar Bommakanti
First published:
May 20, 2019, 2:00 PM IST