తోట త్రిమూర్తులు ఎప్పటికీ నా శత్రువే.. డిప్యూటీ సీఎం ఫైర్

మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు టీడీపీకి గుడ్ బై చెప్పి ఇటీవల వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. సీఎం జగన్ సమక్షంలో తోట త్రిమూర్తులు వైసీపీ కండువా కప్పుకున్నారు.

news18-telugu
Updated: September 18, 2019, 3:51 PM IST
తోట త్రిమూర్తులు ఎప్పటికీ నా శత్రువే.. డిప్యూటీ సీఎం ఫైర్
జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన తోట త్రిమూర్తులు, (పక్కన పిల్లి సుభాష్ చంద్రబోస్)
  • Share this:
మాజీ ఎమ్మెల్యే, రెండు రోజుల క్రితం టీడీపీ నుంచి వైసీపీలో చేరిన కాపు నేత తోట త్రిమూర్తులుపై ఏపీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన ఎప్పటికైనా తనకు శత్రువేనని అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ పార్టీలోకి ఎందరో వస్తుంటారు... పోతుంటారని అన్నారు. వెంకటాయపాలెం శిరోముండనం కేసులో.. వైసీపీ ప్రభుత్వం దళితుల పక్షాన ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. (ఈ కేసులో తోట త్రిమూర్తులుపై ఆరోపణలు ఉన్నాయి) వైసీపీకి దళితులు అండగా ఉన్నారని, వారిని తాము వదులుకునే ప్రసక్తేలేదన్నారు. కేసులో ఏదైనా తేడా జరిగితే బాధితులను నేరుగా సీఎం దగ్గరికి తీసుకెళ్తానని, అవసరమైతే దళితులతో కలిసి ధర్నా చేసేందుకైనా తాను సిద్దమని పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ స్పష్టం చేశారు. కాగా, మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు టీడీపీకి గుడ్ బై చెప్పి ఇటీవల వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. సీఎం జగన్ సమక్షంలో తోట త్రిమూర్తులు వైసీపీ కండువా కప్పుకున్నారు. ఆ సందర్భంగా తామంతా కలిసే ఉంటామని తోట త్రిమూర్తులు ప్రకటించారు. కానీ, రెండు రోజుల్లోనే విబేధాలు బయటపడడం విశేషం.

తోట త్రిమూర్తులు చేరిక సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, రామచంద్రాపురంలో తోట త్రిమూర్తులు మీద పోటీ చేసి విజయం సాధించిన చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, మరికొందరు పార్టీ నేతలు కూడా హాజరయ్యారు. తమ నియోజకవర్గంలో కులాల మధ్య వైరం ఉందంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తోట త్రిమూర్తులు ఈ సందర్భంగా ఆరోపించారు. ఒక్క కులంతో ఎవరూ రాజకీయాలు చేయలేరన్నారు. కానీ, ఇప్పుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

తూర్పుగోదావరి జిల్లాతో పాటు ఏపీలోని కాపు సామాజికవర్గంలో తోట త్రిమూర్తులకు మంచి పట్టుంది. ఆయన 1994లో తొలిసారి ఇండిపెండెంట్‌గా పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 1999లో టీడీపీ నుంచి గెలిచారు. 2004 (టీడీపీ), 2009 (ప్రజారాజ్యం) లో పిల్లి సుభాష్ చంద్రబోస్ చేతిలో ఓడిపోయారు. మళ్లీ 2014లో టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. 2019లో వైపీపీ అభ్యర్థి చేతిలో మరోసారి ఓటమిపాలయ్యారు.
First published: September 18, 2019, 3:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading