• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • AP DY CM PAMULA PUSHPA SRIVANI GETS EMOTIONAL IN A PARTY EVENT BA

కన్నీళ్లు పెట్టుకున్న డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి...

కన్నీళ్లు పెట్టుకున్న డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి...

ఏపీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పుష్ప శ్రీవాణి కన్నీళ్లు పెట్టుకున్నారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పుష్ప శ్రీవాణి కన్నీళ్లు పెట్టుకున్నారు. విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన పుష్ప శ్రీవాణి జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే, ఆ కార్యక్రమంలో మంత్రి పుష్పశ్రీవాణిని వేదిక మీదకు పిలిచారు నిర్వాహకులు. అయితే, ఆమె పక్కనే ఉన్న ఆమె భర్తను మాత్రం వేదిక మీదకు పిలవలేదు. దీంతో ఆమె కన్నీరు పెట్టుకున్నారు. తన ముందు తన భర్తను కనీసం స్టేజీ మీదకు పిలవకపోవడంతో ఆమె అసంతృప్తికి గురయ్యారు. పుష్పశ్రీవాణి కన్నీళ్లు పెట్టుకోవడం చూసిన వైసీపీ నాయకులు వెంటనే జోక్యం చేసుకున్నారు. అనంతరం పుష్పశ్రీవాణి భర్తను స్టేజీ మీదకు పిలిచారు. దీంతో ఆమె సంతృప్తి చెందారు.

    కొన్ని రోజుల క్రితం పాముల పుష్ప శ్రీవాణిని కులవివాదం చుట్టుముట్టింది. ఆమె ఎస్టీ కాదంటూ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం న్యాయ సలహాదారు రేగుమహేశ్‌, అఖిల భారత దళిత హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మణిసింగ్‌ పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజుకు ఫిర్యాదు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెంలో జన్మించిన పుష్పశ్రీవాణి గిరిజన వ్యక్తి కాదని.. ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న విధంగా ఆమెది కొండదేవర తెగ కాదని ఫిర్యాదులో పేర్కొన్నారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: