సీఎం జగన్ దైవసమానుడు, దేవుడి పుత్రుడు.. ఆకాశానికి ఎత్తేసిన డిప్యూటీ సీఎం

కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ లాంటి ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో ప్రజల బాగోగులను ఆలోచించి ఒకే నెలలో మూడు సార్లు రేషన్ ఇస్తున్నామని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు.

news18-telugu
Updated: April 17, 2020, 5:46 PM IST
సీఎం జగన్ దైవసమానుడు, దేవుడి పుత్రుడు.. ఆకాశానికి ఎత్తేసిన డిప్యూటీ సీఎం
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
  • Share this:
ఆదాయం కన్నా ప్రజల ఆరోగ్యమే తమ ప్రభుత్వానికి ముఖ్యమని ఉప ముఖ్యమంత్రి, అబ్కారీ, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి కె.నారాయణస్వామి స్పష్టం చేశారు. ఎక్సైజ్ శాఖాధికారులతో ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు ప్రభుత్వం ఆబ్కారీ శాఖ పరంగా రూ.1500 కోట్లు, వాణిజ్యశాఖ పరంగా రూ.4500 కోట్లు మొత్తం రూ.6000 కోట్లు నష్టపోయిందని వివరించారు. అయినప్పటికీ తమ ప్రభుత్వానికి ఆదాయానికన్నా ప్రజల ఆరోగ్యమే ముఖ్యమన్నారు. ప్రజల ఆరోగ్యానికే పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి సూచించినట్లు మంత్రి తెలిపారు. ముందస్తు ఆలోచనతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వాలంటీర్, గ్రామ సచివాలయ వ్యవస్థ సత్ఫలితాలిస్తోందని, దీన్ని యావత్ ప్రపంచం కొనియాడుతుందని ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి తెలిపారు. ఇటీవలి కాలంలో ఢిల్లీలో కూడా ముఖ్యమంత్రిని పలువురు ప్రశంసించారని గుర్తుచేశారు. లాక్ డౌన్ సమయంలో ఆయా వ్యవస్థలు నిర్వహిస్తున్న బాధ్యతలే అందుకు నిదర్శనమని వెల్లడించారు.

andhra pradesh, ap corona update, dy cm narayana swamy on muslims, muslims covid 19 patients not supporting with docs, నారాయణస్వామి, నారాయణస్వామి ముస్లింలపై వ్యాఖ్యలు, ముస్లింలు సహకరించడం లేదు,
ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి


లాక్ డౌన్ సమయంలో చాలా చోట్ల బార్లకు సంబంధించిన స్టాక్ ను బయట అధికరేట్లకు అమ్ముతున్నారన్న వార్తల నేపథ్యంలో అన్ని బార్లలో, షాపుల్లో స్టాక్ ను తనిఖీ విస్తృతం చేయాలని దిశానిర్ధేశం చేశారు. ఎక్కడైనా అవకతవకలు జరిగినట్లు తన దృష్టికి వస్తే చర్యలకు ఆదేశిస్తామన్నారు. నాటుసారా, ఎన్డీపీఎల్ పై ప్రత్యేక దాడులు నిర్వహించే దిశగా సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెంచాలని ఆదేశించారు.
లాక్ డౌన్ సమయంలో 2,791 కేసులు, 2,849 మంది వ్యక్తులను అరెస్ట్ చేశామని అధికారులు తెలిపారు. సుమారు 22 వేల లీటర్ల ఐడీని సీజ్ చేశామని వెల్లడించారు. 2100 కేసుల ఐఎమ్ఎల్, 1500 కేసుల బీర్లు, 1457 కేసుల ఎన్డీపీఎల్ సీజ్ చేశామన్నారు. అదే విధంగా 665 వాహనాలను సీజ్ చేశామని తెలిపారు.

బార్లలో దొంగతనంగా మద్యం అమ్ముతున్నారని వచ్చిన కథనాల్లో వాస్తవం ఉందని, తమ దృష్టికి రాగానే వెంటనే వాటిపై చర్యలు తీసుకున్నామన్నారు. ఎక్సైజ్, రెవెన్యూ శాఖలు కలిసి విచారణ చేపడుతున్నామన్నారు. ఇప్పటికే ఒక సీఐని, ముగ్గురు ఎస్సైలను, ఒక కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశామని వివరించారు. శాఖాపరమైన విచారణ చేసిన అనంతరం అవకతవకలకు పాల్పడినట్లు తమ దృష్టికి వస్తే ఉద్యోగాలు తొలగించడానికైనా వెనకాడబోమని హెచ్చరించారు.

కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ లాంటి ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో ప్రజల బాగోగులను ఆలోచించి ఒకే నెలలో మూడు సార్లు రేషన్ ఇస్తున్నామన్నారు. అందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజలు దైవసమానుడిగా, దేవుడి పుత్రుడిగా, ప్రజల సేవకుడిగా అభినందిస్తున్నారని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి తెలిపారు. ఈ సమయంలో కొందరు పనిగట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని, రాజకీయాలకు ఇది సరైన సమయం కాదని కరోనాపై నిర్మాణాత్మక సలహాలు, సూచనలిస్తే స్వీకరిస్తామన్నారు.
First published: April 17, 2020, 5:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading