‘చంద్రబాబుకు దేశంలోనే అత్యంత హై సెక్యూరిటీ..’

టీడీపీ అధినేత చంద్రబాబు భద్రతను కుదించారన్న వార్తను ఏపీ డీజీపీ కార్యాలయం కొట్టేసింది. ఆయనకు కల్పిస్తున్న భద్రతలో ఎలాంటి మార్పు జరగలేదని, దేశంలోనే అత్యంత హై సెక్యూరిటీని చంద్రబాబుకు కల్పిస్తున్నట్లు పేర్కొంది.

news18-telugu
Updated: February 19, 2020, 8:27 AM IST
‘చంద్రబాబుకు దేశంలోనే అత్యంత హై సెక్యూరిటీ..’
జగన్మోహన్ రెడ్డిని మించిన నాటకాల రాయుడు మరొకరు లేరని చంద్రబాబు విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు సూచించారు.
  • Share this:
టీడీపీ అధినేత చంద్రబాబు భద్రతను కుదించారన్న వార్తను ఏపీ డీజీపీ కార్యాలయం కొట్టేసింది. ఆయనకు కల్పిస్తున్న భద్రతలో ఎలాంటి మార్పు జరగలేదని, దేశంలోనే అత్యంత హై సెక్యూరిటీని చంద్రబాబుకు కల్పిస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం టీడీపీ చీఫ్‌కు జడ్‌ప్లస్ సెక్యూరిటీతో భద్రత కల్పిస్తున్నామని, సెక్యూరిటీ రివ్యూ కమిటీ నిర్ణయం మేరకు భద్రతలో మార్పులు, చేర్పులు చేసినట్లు తెలిపింది. ప్రస్తుతం ఆయనకు 183 మంది భద్రతా సిబ్బందితో భద్రత కల్పిస్తున్నామని స్పష్టం చేసింది. చంద్రబాబు విజయవాడలో ఉన్నపుడు ఆయనకు 135 మంది రక్షణగా ఉంటారని, హైదరాబాద్‌లో ఉన్నపుడు 48 మందితో భద్రత చేపట్టామని డీజీపీ కార్యాలయం వివరించింది.

కాగా, వైసీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా చంద్రబాబు, లోకేశ్ భద్రతను తగ్గించిందని టీడీపీ ఆరోపించింది. చంద్రబాబుకు టెర్రరిస్టులు, మావోయిస్టులు, స్మగ్లర్ల నుంచి ముప్పు పొంచి వుందని, అందుకే NSG, జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా భద్రతను సగానికి సగం కుదించిందని ఆరోపించిన నేపథ్యంలో ఏపీ డీజీపీ కార్యాలయం స్పందించింది.
Published by: Shravan Kumar Bommakanti
First published: February 19, 2020, 7:29 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading