డ్రోన్ వివాదంపై స్పందించిన ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్

ఇక పై ఎవరైన డ్రోన్ ఉపయోగించాలి అంటే స్థానిక పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు.

news18-telugu
Updated: August 19, 2019, 1:55 PM IST
డ్రోన్ వివాదంపై స్పందించిన ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్
చంద్రబాబు నాయుడు, గౌతం సవాంగ్ (File Photo)
  • Share this:
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటిపైన ఎగరేసిన డ్రోన్ వివాదంపై ఏపీ డిజిపి గౌతమ్ సవాంగ్..స్పందించారు. వరదల కారణంగా అంచనా కోసం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డ్రోన్ ఉపయోగించారన్నారు. లోకల్ పోలీసులకు సమాచారం లేకపోవడం వల్లనే కమ్యునికేషన్ గ్యాప్ వచ్చిందన్నారు.అంతే తప్పా ఇందులో ఎలాంటి కుట్ర లేదన్నారు. డ్రోన్ల అంశాన్ని రాజకీయం చేయద్దన్నారు. ఇక పై ఎవరైన డ్రోన్ ఉపయోగించాలి అంటే స్థానిక పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ఇరిగేషన్ అధికారులకు స్థానిక పోలీసులకు మద్య సమన్వయం లేని కారణంగా ఈ వివాదం నెలకొందన్నారు గౌతమ్ సవాంగ్.

కొన్నిరోజుల క్రితం ఉండవల్లిలోని కృష్ణానది కరకట్టపై ఉన్న చంద్రబాబు ఇంటిపై డ్రోన్ కెమెరాలు ఎగిరిన విషయం తెలిసింది. దీంతో ఈ అంశంపై టీడీపీ నేతలు ఆరోపణలు చేశారు. మాజీ సీఎం ఇంటిపై డ్రోన్లు ఎలా ఎగురుతాయంటూ ప్రశ్నించారు. మరోవైపు ఇదే అంశంపై చంద్రబాబు డీజీపీతో పాటు గుంటూరు ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడినట్టు తెలుస్తోంది. హై సెక్యూరిటీ జోన్‌లో ఈ రకంగా డ్రోన్లను ఎలా వినియోగిస్తారని ఆయన వారిని ప్రశ్నించినట్టు సమాచారం. డ్రోన్ల వినియోగానికి ప్రభుత్వం లేదా డీజీపీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని... మీరు ఎవరికైనా అనుమతి ఇచ్చారా అని చంద్రబాబు డీజీపీని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. తన భద్రతను ప్రశ్నార్థకంగా మార్చడంపై డీజీపీపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

First published: August 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>