Home /News /politics /

AP DGP GAUTAM SAWANG MEET CM JAGAN AT TADEPALLI CAMP OFFICE SB

జగన్‌తో డీజీపీ భేటీ... ఎమ్మెల్యే కారు దాడిపై సీఎం ఆరా

సీఎం జగన్‌తో ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్

సీఎం జగన్‌తో ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో రాష్ట్రంలోని శాంతి భద్రతల అంశం గురించి చర్చించినట్టు సమాచారం.

    ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ సీఎం జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన అమరావతిలో జరుగుతున్న ఆందోళనలపై సీఎంకు వివరించారు. మంగళవారంలో చినకాకాని గ్రామంలో ప్రభుత్వ విప్, వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారుపై జరిగిన దాడి విషయాల్ని కూడా అడిగి తెలుసుకున్నారు. దీంతో పాటు అమరావతిలో అసలు ఎలాంటి భద్రతా  చర్యలు చేపడతున్నారన్న సమాచారాన్ని కూడా సీఎం డీజీపిని అడిగి తెలుసుకున్నారు.

    ఏపీ రాజధాని అమరావతిని తరలించవద్దంటూ కొన్ని రోజులుగా రైతుల ఆందోళన సాగుతోంది. ఇందులో భాగంగా మంగళవారం  రైతులు చేపట్టిన రహదారుల దిగ్బంధం ఉద్రిక్తంగా మారింది. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యేలకు కూడా చేదు అనుభవం ఎదురయ్యింది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ తో డీజీపీ గౌతమ్ సవాంగ్ భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో రాష్ట్రంలోని శాంతి భద్రతల అంశం గురించి చర్చించినట్టు సమాచారం. శాంతి భద్రతల పరంగా తీసుకోవాల్సిన చర్యలపై డీజీపీకి సీఎం పలు సూచనలు చేసినట్టు తెలుస్తోంది. దీంతో పాటు ఎమ్మెల్యేలపై దాడికి యత్నించిన ఘటనలకు సంబంధించి లభ్యమైన ఆధారాలు, పోలీసులు తీసుకున్న చర్యల గురించి జగన్ కు సవాంగ్ వివరించినట్టు సమాచారం.
    Published by:Sulthana Begum Shaik
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP News, Gautam Sawang

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు