కోడెల శివప్రసాదరావు మృతిపై డిప్యూటీ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు

చనిపోయిన వారికి గౌరవం ఇవ్వాలన్న కనీస జ్ఞానం కూడా వైసీపీ నేతలకు లేదని నిప్పులు చెరుగుతున్నారు టీడీపీ నేతలు.

news18-telugu
Updated: September 16, 2019, 5:52 PM IST
కోడెల శివప్రసాదరావు మృతిపై డిప్యూటీ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు
కోడెల శివప్రసాదరావు (File)
  • Share this:
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతిపై ఏపీలో రాజకీయ దుమారం రేగుతోంది. ఆయనది ఆత్మహత్య కాదని.. ప్రభుత్వమే హత్యం చేసిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కేసులతో వేధించడం వల్లే కోడెల చనిపోయారని చంద్రబాబు సైతం అన్నారు. టీడీపీ ఆరోపణలపై వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. హత్యా రాజకీయాలు చేయడం సరికాదన్ని మండిపడుతున్నారు. ఈ క్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎవరు దొంగతనం చేయమన్నారు? ఎవరు చనిపోమన్నారు? అని వ్యాఖ్యానించారు.

కోడెల చనిపోయినందుకు బాధపడుతున్నాం. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. కానీ టీడీపీ నేతలు ప్రభుత్వం చేసిన హత్యగా చెబుతున్నారు. దొంగతనాలు ఎవరు చేయమన్నారు? ఎవరు చనిపోమన్నారు? ఆమె కోడలు కూడా కేసు పెట్టింది. కేసులు నమోదైనప్పుడు ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. అసెంబ్లీ ఫర్నిచర్ దొంగతనం చేసినట్లు రుజువైంది. ఆయనే అంగీకరించారు. ప్రభుత్వ ఆస్తి మా దగ్గర ఉంది..డబ్బులు కడతానని ఆయనే అన్నారు. ప్రజలకు ముఖం చూపించలేకే కోడెల చనిపోయి ఉంటారు.
పిల్లి సుభాష్ చంద్రబోస్
పిల్లి సుభాష్ వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. మరణించిన వ్యక్తిపై ఇలాగేనా మాట్లాడేదని విరుచుకుపడుతున్నారు. చనిపోయిన వారికి గౌరవం ఇవ్వాలన్న కనీస జ్ఞానం కూడా వైసీపీ నేతలకు లేదని నిప్పులు చెరుగుతున్నారు.
First published: September 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading