Home /News /politics /

ఇసుక దోపిడీ సంఘం అధ్యక్షుడు... టీడీపీ ఎమ్మెల్యేపై మండిపడ్డ ఏపీ మంత్రి

ఇసుక దోపిడీ సంఘం అధ్యక్షుడు... టీడీపీ ఎమ్మెల్యేపై మండిపడ్డ ఏపీ మంత్రి

ఏపీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్(ఫైల్ ఫోటో)

ఏపీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్(ఫైల్ ఫోటో)

ఇసుక కొరతపై అసత్యాలను ప్రచారం చేస్తున్నారంటూ టీడీపీ ఎమ్మెల్యేపై ఏపీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ మండిపడ్డారు.

    టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుపై ఏపీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జోగేశ్వరరావు బురద చల్లుడు రాజకీయాలు మానుకోవాలని డిప్యూటీ సీఎం సుభాష్‌ చంద్రబోస్‌ సూచించారు. కాకినాడలో మీడియాతో మాట్లాడిన పిల్లి సుభాష్ చంద్రబోస్... ఇసుక దోపిడీలో జిల్లాలోనే ప్రథమస్థానంలో నిలిచిన వ్యక్తి వేగుళ్ల జోగేశ్వరరావు అని విమర్శించారు. అటువంటి వ్యక్తి ఇవాళ ఇసుక కోసం మాట్లాడటం విడ్డూరంగా ఉందని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావును ఇసుక దోపిడీ సంఘానికి అధ్యక్షుడిగా పెట్టుకోవచ్చని ఎద్దేవా చేశారు.

    జిల్లాలోని టేకి గ్రామంలో ఒక వ్యక్తి తన వ్యక్తిగత కారణాల వల్ల మరణిస్తే... ఇసుక లభించక మృతిచెందాడని వేగుళ్ల మాట్లాడటం సరికాదని ఆయన డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ మండిపడ్డారు. ఆయన ప్రభుత్వంపై బురదచల్లడం తప్పిస్తే..వాస్తవ పరిస్థితులు చెప్పడంలేదని అన్నారు. ఒకవేళ టేకిలోని వ్యక్తి నిజంగానే ఇసుక కొరత కారణంగా చనిపోతే... తాను బహిరంగ క్షమాపణలు చెబుతానని మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ సవాల్ విసిరారు. లేకపోతే ఆయన క్షమాపణ చెప్పాలని అన్నారు. ఇందుకు టీడీపీ ఎమ్మెల్యే సిద్ధమేనా అని ప్రశ్నించారు.




    First published:

    Tags: AP News, Pilli Subhash Chandra Bose, Tdp, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు