హోమ్ /వార్తలు /రాజకీయం /

జగన్‌ను జైల్లో పెట్టించి అలా... ఏపీ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు

జగన్‌ను జైల్లో పెట్టించి అలా... ఏపీ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు

ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి (ఫైల్ ఫోటో)

ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి (ఫైల్ ఫోటో)

దేశంలోని అత్యధికంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న ఏపీని అన్ని రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకోవాలని చూస్తున్నాయని డిప్యూటీ సీఎం నారాయణస్వామి వ్యాఖ్యానించారు.

చంద్రబాబు హయాంలో ఎస్సీలను విడదీసి పాలించే చర్యలు చేపట్టారని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆరోపించారు. కానీ మాల మాదిగలను అట్రాక్ట్ చేసే విధంగా జగన్ చర్యలు చేపట్టారని అన్నారు. అందుకే ఆ కులాల వారు ఆయనకు దగ్గరయ్యారని తెలిపారు. కరోనా వైరస్ అంశంలో జగన్ చెప్పిన విధంగా ప్రపంచం మొత్తం ఈ రోజు కరోనా వైరస్‌తో కలిసి జీవించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని అన్నారు. దేశంలోని అత్యధికంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న ఏపీని అన్ని రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకోవాలని చూస్తున్నాయని వ్యాఖ్యానించారు.

జగన్‌ను జైల్లో పెట్టించిన సోనియాగాంధీ, చంద్రబాబు రాజకీయ భవిష్యత్తు ఏవిధంగా మారిందో అందరూ చూస్తున్నారని నారాయణస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయనను బాధించారో వారందరి రాజకీయ జీవితం ఏ విధంగా జీరో అయిందో తెలుస్తోందని అన్నారు. జైల్లో ఉన్న జగన్ అన్న కోసం సీఎం కావాలని ఎంతో మంది ఎన్నో రకాలైన పూజలు చేశారని అన్నారు. ఎన్టీఆర్ తీసుకొచ్చిన మద్యపాన నిషేధానికి చంద్రబాబు తూట్లు పొడిచి మద్యాన్ని ఏరులై పారించారని... పేదల రక్తాన్ని మద్యం రూపంలో పీల్చి పిప్పిచేసిన ఘనత చంద్రబాబుదే అని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Chandrababu naidu, Sonia Gandhi

ఉత్తమ కథలు