news18-telugu
Updated: November 27, 2020, 11:10 PM IST
ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి(ఫైల్ ఫోటో)
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి (Narayana swamy)కి త్రుటిలో ప్రమాదం తప్పింది. నారాయణ స్వామి ప్రయాణిస్తున్న కారును.. ఆయన కాన్వాయ్‌లోని మరో వాహనం వెనక నుంచి ఢీకొట్టింది. తెలంగాణలోని కోదాడ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో డిప్యూటీ సీఎం కారు స్వల్పంగా దెబ్బతింది. ఆయన క్షేమంగా బయటపడ్డారు. డిప్యూటీ సీఎం ఎస్కార్ట్‌లోని ఓ వాహనం ఒక్కసారిగా ఆగడంతో.. వెనకాల వచ్చిన వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. కారు డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడం వల్లే ప్రమాదం జరిగిందని.. నారాయణస్వామికి ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు చెప్పారు. మంత్రి క్షేమంగా బయటపడడంతో అందరూ ఊపిిరిపీల్చుతున్నారు. ఘటన జరిగిన కాసేపటికి అదే కారులో హైదరాబాద్ వెళ్లిపోయారు నారాయణస్వామి. ఏపీ కేబినెట్ సమావేశంముగిసిన తర్వాత.. మంత్రి కాన్వాయ్ విజయవాడ (Vijayawada) నుంచి హైదరాబాద్ (Hyderabad)కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కాగా, ఘటనపై పోలీసులు ఆరాతీస్తున్నారు.
Published by:
Shiva Kumar Addula
First published:
November 27, 2020, 8:30 PM IST