ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై డిప్యూటీ సీఎం క్లారిటీ

ప్రతీకాత్మక చిత్రం

జగన్ అధికారంలోకి వచ్చాక.. ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అసలు కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తారా? ఒక వేళ చేస్తే ఎప్పుడు ప్రారంభిస్తారు? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

  • Share this:
    ఏపీలో కొత్త జిల్లాలపై చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తారని జోరుగా ఊహాగానాలు వినిపించాయి. ఇప్పుడున్న 13 జిల్లాలకు అదనంగా మరో 12 జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేస్తారని పలువురు వైసీపీ నేతలు సైతం వ్యాఖ్యానించారు. ఒక్కో లోక్‌సభ స్థానాన్ని ఒక జిల్లాగా ప్రకటించి... ఏపీలో మొత్తం 25 జిల్లాలను ఏర్పాటవుతాయని జోస్యం చెప్పారు. ఐతే జగన్ అధికారంలోకి వచ్చాక.. ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అసలు కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తారా? ఒక వేళ చేస్తే ఎప్పుడు ప్రారంభిస్తారు? అనే ప్రశ్నలు అందరిలోనూ ఉత్పన్నమవుతున్నాయి.

    ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ఏపీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతానికి కొత్త జిల్లాల ఆలోచన లేదని ఆయన స్పష్టంచేశారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే ఈ అంశంపై ప్రభుత్వం ఆలోచిస్తుందని.. ఆ తర్వాతే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. అమరావతిలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు పిల్లి సుభాష్. పేద ప్రజల కోసం ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం.. పిల్లి సుభాష్ నేతృత్వంలో సదస్సులను నిర్వహిస్తోంది. ఈ నెల 17 నుంచి జిల్లాల వారీగా రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 25 లక్షల మందికి స్థలాలు గుర్తించేందుకు కసరత్తు చేస్తున్నారు.
    First published: