ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో రాష్ట్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు సమావేశం అయ్యారు. చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని, సీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్, డీజీపీ గౌతమ్ సవాంగ్ గురువారం రాత్రి గవర్నర్ హరిచందన్‌ను కలిశారు. ఆంధ్రప్రదేశ్‌లో స్థానికసంస్థల ఎన్నికలు వాయిదా, రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, అలాగే, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసినట్టుగా ప్రచారంలో ఉన్న లేఖ మీద వారు గవర్నర్‌తో చర్చించినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించడానికి అనువుగా ఉందని తాము ఎస్ఈసీకి రాసిన లేఖ, దానికి రమేష్ కుమార్ నుంచి వచ్చిన ప్రత్యుత్తరం గురించి కూడా నీలం సాహ్ని గవర్నర్‌కు తెలిపినట్టు సమాచారం.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయం తీసుకోవడం రాష్ట్రంలో పెను సంచలనానికి దారి తీసింది. రమేష్ కుమార్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తికి గురైన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హుటాహుటిన రాజ్ భవన్ వెళ్లి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిశారు. రమేష్ కుమార్ నిర్ణయం మీద ఫిర్యాదు చేశారు. ఆయన్ను పిలిచి మాట్లాడాలని, మళ్లీ ఎన్నికలు యధావిధిగా కొనసాగేలా చూడాలని కోరారు. గవర్నర్ పిలుపు మేరకు రాజ్ భవన్ వెళ్లిన ఎస్ఈసీ రమేష్ కుమార్ తన వివరణ ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని, కేంద్ర ప్రభుత్వంలోని వైద్య ఆరోగ్య శాఖ సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. మరోవైపు ఏపీలో ఎన్నికల నిర్వహణకు ఎలాంటి అవరోధాలు లేవంటూ చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని ఎస్ఈసీకి లేఖ రాశారు. అందుకు ఆయన బదులిస్తూ తన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, ఎన్నికలు వాయిదా వేసే ప్రసక్తే లేదని చెప్పారు.
ఈ క్రమంలో టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను ఎలా తొలగించాలనేది ఆలోచిస్తున్నామని ప్రభుత్వ సలహాదారు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించడం సంచలనంగా మారింది. మంత్రి మోపిదేవి వెంకటరమణ కూడా రమేష్ కుమార్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సమయంలో సీఎస్
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.