ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యంను మానవవనరుల అభివృద్ధి కేంద్రం డైరెక్టర్ జనరల్‌గా బదిలీ చేసింది. ఎవరూ ఊహించని విధంగా జగన్ ప్రభుత్వం ఈ అడుగు వేసింది. సాధారణంగా చీఫ్ సెక్రటరీగా నియమితులైన వారు తమ పదవీకాలం ముగిసేవరకు సీఎస్‌గా కొనసాగుతారు. కానీ, ఊహించని విధంగా ఎల్వీ సుబ్రమణ్యం బదిలీ జరిగింది. చీఫ్ సెక్రటరీగా ఉన్న ఎల్వీని మానవవనరుల కేంద్రం అభివృద్ధి డీజీగా బదిలీ చేస్తూ ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ (పొలిటికల్) ప్రవీణ్ ప్రకాష్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఎల్వీ సుబ్రమణ్యంను బదిలీ చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు
అయితే, చీఫ్ సెక్రటరీగా ఉన్న తన సీనియర్ అధికారిని ఆయనకంటే జూనియర్ అయిన ప్రవీణ్ ప్రకాష్ బదిలీ చేయవచ్చా? ఇలాంటి అధికారం ఉందా? అనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. అయితే, దీనికి సంబంధించి ద న్యూస్ మినిట్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ రిపోర్ట్ ప్రకారం.. ‘బిజినెస్ రూల్స్ ప్రకారం సీఎంఓలో ఉండే ఏ అధికారికి కూడా మరే ఇతర అధికారిని బదిలీ చేసే అధికారం ఉండదు. ముఖ్యంగా చీఫ్ సెక్రటరీని బదిలీ చేసే అధికారం అసలు ఉండదు. ఏపీలో ప్రభుత్వ పాలన కుప్పకూలినట్టు కనిపిస్తోంది. సీఎంఓలో ఉండే వ్యక్తులు అదనపు అధికారాలను ప్రదర్శించడం వల్ల అధిక సీఎంఓకే సమస్యలు తెస్తుంది. ముఖ్యమంత్రిని ఎవరో తప్పుడు డైరెక్షన్లో నడిపిస్తున్నారు. వారు ఎవరైనా కానీ, ఇలాంటి సలహాలు మంచివి కావు.’ అని రిటైర్డ్ అధికారి ఈఏఎస్ శర్మ చెప్పినట్టు ద న్యూస్ మినిట్ కథనంలో పేర్కొంది.
మరోవైపు పేరు చెప్పడానికి నిరాకరించిన ఓ బ్యూరోక్రాట్ శర్మ అభిప్రాయంతో విభేదించారని కూడా తెలిపింది. ప్రవీణ్ ప్రకాష్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ప్రభుత్వ పాలనకు ఇన్చార్జి. కాబట్టి, అలాంటి ట్రాన్స్ఫర్ ఆర్డర్ల మీద సంతకాలు చేసే అధికారం ఆయనకే ఉంటుందని చెప్పినట్టు ఆ కథనంలో పేర్కొంది.
పోలీసుపై న్యాయవాదుల దాడి
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.