ఏపీ కేబినెట్ భేటీపై ...సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో కేబినెట్ మీటింగ్ పెట్టాలనుకుంటే ఈసీ అనుమతి తప్పనిసరి అన్నట్లు ఆయన చెప్పినట్లు సమాచారం. కేంద్ర మంత్రివర్గ సమావేశాలు కూడా ఎన్నికల సంఘం అనుమతిస్తేనే నిర్వహించారన్నారు. అయితే ఏయే అంశాలపై కేబినెట్ మీటింగ్ పెట్టాలనుకుంటున్నారో ఈసీకి స్పష్టమైన సమాచారం ఇవ్వాలన్నారు. అజెండాను ఈసీకి పంపి అనుమతి వచ్చాక కేబినెట్ భేటీ పెట్టుకోవచ్చాన్నారు. తాజాగా సీఎం ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్, సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంతో భేటీ అయ్యారు. మంత్రివర్గ సమావేశానికి అనుమతి కోరుతూ లేఖను అందించారు. దీనిపై స్పందించిన సీఎస్ పైవిదంగా వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.
ఈనెల 10న కేబినెట్ భేటీ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు టీడీపీ, ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఫణి తుఫాను బాధితులకు సహాయక చర్యలపై సమీక్ష, అకాల వర్షాల్లో రైతులకు వాటిల్లిన నష్టం, ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి సరఫరా వివిధ సమస్యలపై ఈ భేటీలో చర్చించే అవకాశముంది. ఈ సమావేశం నిర్వహణ అజెండాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంకు పంపించారు. దీంతో దీనిపై ఆమోదం విధించిన అంశంలో సీఎస్ సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. మరి ఇప్పటికే ఏపీలో ఉప్పు నిప్పులా మారిన సీఎం వర్సెస్ సీఎస్ వ్యవహారంతో... మంత్రివర్గ సమావేశం జరుగుతుందా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Published by:Sulthana Begum Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.