AP CS LV SUBRAHMANYAM DISCUSSES ON CHANDRABABU CABINET MEETING SB
ఏపీ సీఎస్తో సమావేశమైన సీఎం కార్యదర్శి ... రాజకీయవర్గాల్లో ఉత్కంఠ?
సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం, సీఎం చంద్రబాబునాయుడు
సీఎస్, సీఈవో ద్వివేదితో చర్చలు జరుపుతున్నారు. ఒకవేళ సీఎం కేబినెట్ భేటీకి అనుమతి ఇస్తే.. అజెండా వరకు పరిమితం అవుతుందా ?లేదా బిజినెస్ రూల్స్ మీద చర్చిస్తారా ? అన్న అనుమానాల్ని సీఎస్ వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంతో ముఖ్యమంత్రి కార్యదర్శి సమావేశమయ్యారు. కేబినెట్ భేటీ నిర్వహణపై చర్చించినట్లు సమాచారం. దీంతో ఇప్పుడు కేబినెట్ భేటీపై సీఎస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటానే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది. ఎన్నికల కోడ్ అమల్లోకి ఉండటంతో సీఎం ఎలాంటి అధికారిక సమావేశాలు నిర్వహించడానికి వీలుండదు. దీంతో సీఎస్, సీఈవో ద్వివేదితో చర్చలు జరుపుతున్నారు. ఒకవేళ సీఎం కేబినెట్ భేటీకి అనుమతి ఇస్తే.. అజెండా వరకు పరిమితం అవుతుందా ?లేదా బిజినెస్ రూల్స్ మీద చర్చిస్తారా ? అన్న అనుమానాల్ని సీఎస్ వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. దీంతోపాటు ఎన్నికల కోడ్ కూడా అమల్లో ఉండటంతో కేబినెట్ నిర్వహణపై అధికారులతో సీఎస్ చర్చలు జరుపుతున్నారు.
ఈనెల 10న కేబినెట్ భేటీ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు టీడీపీ, ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఫణి తుఫాను బాధితులకు సహాయక చర్యలపై సమీక్ష, అకాల వర్షాల్లో రైతులకు వాటిల్లిన నష్టం, ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి సరఫరా వివిధ సమస్యలపై ఈ భేటీలో చర్చించే అవకాశముంది. ఈ సమావేశం నిర్వహణ అజెండాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంకు పంపించారు. దీంతో దీనిపై ఆమోదం విధించిన అంశంలో సీఎస్ సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. మరి ఇప్పటికే ఏపీలో ఉప్పు నిప్పులా మారిన సీఎం వర్సెస్ సీఎస్ వ్యవహారంతో... మంత్రివర్గ సమావేశం జరుగుతుందా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే కేబినెట్ నిర్వహణ అజెండాకు సీఎస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఏపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలతో సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ... బాబు కేబినెట్ భేటీకి ఓకే చెప్తారా ?లేదా? అన్నదానిపై సస్పెన్స్ నెలకొంది.
Published by:Sulthana Begum Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.