water dispute : ఏపీ దాదాగిరిపై కౌంటర్ ఇచ్చిన సజ్జల..దాదాగిరి మీదా...మాదా అంటూ..

సజ్జల రామకృష్ణారెడ్డి(ఫైల్ ఫొటో)

CM KCR : ‌కృష్ణానదీ ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వంతో పాటు కేంద్రం సైతం దాదాగిరి చేస్తోందని సీఎం కేసిఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు.. దాదాగిరి ఎవరు చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని ఆయన స్పష్టం అన్నారు

  • Share this:
    ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న విద్యుత్ ఉత్పత్తిపై ఆయన ప్రశ్నించారు..దాదాగిరి అంటే విద్యుదుత్పత్తి పేరుతో నీటిని సముద్రంలోకి వదలడమే కదా అంటూ చురకలంటించారు. మరోవైపు కేంద్ర జలశక్తి శాఖ ఇచ్చిన ఆదేశాలను కూడా పక్కన పెట్టారని ఆయన విమర్శించారు.తెలంగాణ ఎగువ ప్రాంతంలో ఉన్నామనే భావంతోనే జల వివాదాలు సృష్టిస్తున్నారని ఆయన అన్నారు. సాగు నీటి అవసరాలను కాదని విద్యుద్ ఉత్పత్తికి నీటిని వాడుకోవడంతో తెలంగాణ నీటి ఒప్పందాలను ఉల్లంఘించిందని ఆయన ఫైర్ అయ్యారు.

    రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదంపై ముఖ్యమంత్రి కేసిఆర్ సీరియస్ కామెంట్స్ చేశారు. నేడు నాగార్జున సాగర్‌లో పర్యటించిన ఆయన.. హాలియాలో నిర్వహించిన సభలో నీటి వివాదాన్ని ప్రస్తావించారు. పొరుగు రాష్ట్రం ఏపి దాదాగిరి చేసి ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని మండిపడ్డారు.. ప్రజలు ఈవిషయాన్ని గమనిస్తున్నారని ఆయన అన్నారు.. ఈ క్రమంలోనే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. నీటి వివాదంపై కేంద్ర ప్రభుత్వం సమస్యను పరిష్కరించాల్సింది పోయి తెలంగాణ వ్యతిరేక వైఖరిని అవలంభిస్తోందని కేసీఆర్ ఆగ్రహించారు.

    మరోవైపు జలవివాదాలపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రెండు నదుల పై నిర్మించిన ప్రాజెక్టులతో పాటు కొత్త ప్రాజెక్టులకు సంబంధించి వివాదాలపై పరిష్కరించేందుకు గాను తమ ఆధీనంలోకి తీసుకుంది. ఇందుకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. అయితే ఆ నోటిఫికేషన్ ఆక్టొబర్ నుండి అమలులోకి రానుందని స్పష్టం చేసింది. బోర్డుల నిర్వాహాణకు సంబంధించి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చెరో రెండు వందల కోట్లు కూడా విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇందుకు అంగీకరించడం లేదు..బోర్డుల నిర్వాహాణకు తమ వద్ద డబ్బులు కూడా లేవని స్పష్టం చేసింది.

    ఇక వివాదంపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు.. జల వివాదాల కేసులో మధ్య వర్తిత్వం వహించేందుకు కోర్టు సిద్దంగా ఉందని,కాని... ఈ అంశంపై తీర్పు మాత్రం చెప్పలేనని వ్యాఖ్యానించారు. అయితే తాజాగా సీఎం కేసిఆర్ చేసిన వ్యాఖ్యలు మరోసారి వాగ్వాదానికి వేదికలు అయ్యాయి.
    Published by:yveerash yveerash
    First published: