ఇద్దరు టీడీపీ ఎమ్మెల్సీల అనర్హతపై జూన్ 3న విచారణ...

జూన్ 3వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు వచ్చి చైర్మన్ చాంబర్‌లో వివరణ ఇవ్వాలని ఇద్దరు ఎమ్మెల్సీలను ఆ లేఖలో కోరారు.

news18-telugu
Updated: May 29, 2020, 8:16 PM IST
ఇద్దరు టీడీపీ ఎమ్మెల్సీల అనర్హతపై జూన్ 3న విచారణ...
ఏపీ శాసనమండలి చైర్మన్ షరీఫ్
  • Share this:
తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు శివనాథరెడ్డి, పోతుల సునీత మీద అనర్హత వేటు వేయాలంటూ టీడీపీ విప్ బుద్ధా వెంకన్న అందించిన ఫిర్యాదు మీద జూన్ 3న విచారణ జరగనుంది. టీడీపీ తరఫున ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఆ ఇద్దరు పార్టీ విప్‌ను ధిక్కరించిన ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసినందును ప్రజాప్రతినిధ్య చట్టం ప్రకారం వారి మీద అనర్హత వేటు వేయాలని బుద్ధా వెంకన్న కోరారు. మండలిలో పలు బిల్లులపై పార్టీ విప్‌కు వ్యతిరేకంగా ఓటు వేశారని ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో వారిద్దరూ వచ్చి తమ అభిప్రాయాలు తెలియజేయాలంటూ శాసనమండలి కార్యాలయం నుంచి లేఖలు అందాయి. జూన్ 3వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు వచ్చి చైర్మన్ చాంబర్‌లో వివరణ ఇవ్వాలని ఆ లేఖలో కోరారు.
First published: May 29, 2020, 8:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading