జగన్ మైండ్ గేమ్... మండలిలో టీడీపీ ఎత్తును ఊహించి ముందే పై ఎత్తు...

ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలన్నా, ప్రభుత్వం ఖజానా నుంచి రూపాయి తీసుకోవాలన్నా కూడా ద్రవ్య వినిమయ బిల్లే ప్రధానం.

news18-telugu
Updated: June 18, 2020, 4:50 PM IST
జగన్ మైండ్ గేమ్... మండలిలో టీడీపీ ఎత్తును ఊహించి ముందే పై ఎత్తు...
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలో నిన్న రచ్చ రచ్చ జరిగింది. ద్రవ్య వినిమయ బిల్లు సహా కీలక బిల్లులు ఏవీ ఆమోదం పొందకుండానే మండలి నిరవధిక వాయిదా పడింది. అధికార వైసీపీ మంత్రులు, ప్రతిపక్ష టీడీపీ ఎమ్మెల్సీల మధ్య కొట్లాట, ముష్టిఘాతాలు కూడా చోటుచేసుకున్నట్టు పరస్పరం ఆరోపణలు గుప్పించుకున్నాయి పార్టీలు. ద్రవ్య వినిమయ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లు, అభివృద్ధి వికేంద్రీకరణ (మూడు రాజధానుల ) బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే, ద్రవ్య వినిమయ బిల్లు అనేది డబ్బులతో ముడిపడింది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలన్నా, ఖజానా నుంచి ఒక్క రూపాయి అయినా తీసుకోవాలన్నా కూడా ఈ బిల్లు ముఖ్యం. మరి ద్రవ్య వినిమయ బిల్లు పాస్ కాలేదు. మరోవైపు శాసనమండలి నిరవధిక వాయిదా పడింది. ఈ క్రమంలో ఈ బిల్లు కోసం మరోసారి మండలిని సమావేశపరుస్తారా? అనే చర్చ సహజంగానే చాలా మందిలో నెలకొంది. ఈ క్రమంలో ప్రభుత్వ వర్గాలు ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని చెబుతున్నాయి.

‘ద్రవ్య వినిమయ బిల్లు అనేది మనీ బిల్లు. ఇది శాసనసభ ఆమోదం పొందింది. ఆ తర్వాత శాసనమండలికి వెళ్లింది. ఒకవేళ అక్కడ ఆమోదిస్తే ఓకే. ఒకవేళ ఆమోదించకుండా ఇలా మండలి నిరవధిక వాయిదా పడినా కూడా ఇబ్బంది ఉండదు. శాసన సభ ఆమోదం పొందింది కాబట్టి, 14 రోజుల్లో ఆ బిల్లు ఆమోదం పొందినట్టే లెక్క.’ అని శాసనవర్గాలు చెబుతున్నాయి. 14 రోజులు అంటే జూలై 1. ప్రభుత్వం మూడు నెలల కోసం తీసుకొచ్చిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమయం జూన్ 30తో ముగుస్తుంది. జూలై 1 నుంచి ప్రభుత్వం తెచ్చిన రూ.2.2 లక్షల కోట్ల బడ్జెట్‌లో నుంచి తీసుకోవచ్చన్నమాట. ప్రభుత్వం ముందస్తు వ్యూహం ప్రకారమే 16వ తేదీన బడ్జెట్ తీసుకొచ్చిందని శాసనమండలిలో టీడీపీ అడ్డుకున్నా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా జూలై 1కి 14 రోజుల ముందే శాసనసభలో బడ్జెట్ పెట్టిందని వైసీపీ నేతలు చెబుతున్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: June 18, 2020, 4:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading