ఏపీలో రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికల ఫలితాలకు ఇంకా రెండు వారాలున్నప్పటికీ... మినిట్ టు మినిట్ ఏపీ పాలిటిక్స్ మారిపోతున్నాయి. కొన్నిరోజులుగా సైలెంట్‌గా ఉన్న ఏపీ కాంగ్రెస్ అనూహ్యంగా తెరపైకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ నేతలు కొత్త అంశాన్ని లేవనెత్తుతూ రాజికీయంగా మరింత హీట్ పుట్టేలా చేశారు. ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లేఖ రేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ లేకుండా చేస్తున్న కేసీఆర్‌ను... కేంద్రంలో కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని లేఖ ద్వారా కోరారు. ఇప్పుడిదే అంశం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. కేసీఆర్‌కు రఘువీరా లేఖ వెనుక అసలు కారణాలేంటి అన్నదానిపై రాజకీయ నేతలు చర్చించుకుంటున్నారు. ఒకవేళ ఏపీలో వైసీపీ గెలిస్తే.. .ప్రత్యేక హోదా రాష్ట్రానికి తీసుకువస్తానని హామీ ఇచ్చింది. అటు కేంద్రంలో కాంగ్రెస్ కూడా ఇదే మాట చెప్పింది. ప్రత్యేక హోదా ఎవరిస్తే వారితో కలవడానికి సిద్ధమంటూ జగన్ కూడా తేల్చి చెప్పేశారు.
ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం మాత్రి ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని ఎప్పుడో తేల్చేసింది. దీంతో బీజేపీపై అలాంటి ఆశలేవి లేవు. దీంతో ఇప్పుడు ఏపీలోని అన్ని పార్టీలు కాంగ్రెస్ ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ గురించే చర్చించుకుంటున్నాయి. మరోవైపు సీఎం కేసీఆర్‌కూడా ఏపీకి ప్రత్యేక హోదాపై మద్దతు తెలిపారు. కవిత, కేటీఆర్‌కూడా ఇదే మాట చెప్పారు. అయితే ఇవన్నీ పరిశీలించిన ఏపీ కాంగ్రెస్ నేత రఘువీరా రెడ్డి చాలా తెలివిగా పావును కదిపారు. ఏపీకి ప్రత్యేక హోదా రావాలని కోరుకుంటున్నవారంతా... కేంద్రంగా కాంగ్రెస్‌కు మద్దతివ్వాలన్న షరతు పెట్టేలా రఘువీరా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్‌తో పాటు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు కూడా మద్దతు తెలపాలని రఘువీరారెడ్డి కోరారు. త్వరలో జగన్‌ను కూడా రఘువీరా దీనిపై అడిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మొత్తం మీద కేంద్రంలో కాంగ్రెస్‌కు మద్దతివ్వాలంటూ కేసీఆర్‌కు రఘువీరారెడ్డి రాసిన లేఖ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే రఘువీరారెడ్డి లేఖతో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని తెలంగాణ కాంగ్రెస్ నేత గూడురు నారాయణరెడ్డి అన్నారు. ఇది పూర్తిగా రఘువీరారెడ్డి వ్యక్తిగతమని ఆయన తెలిపారు. ఏదేమైనా... ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడి హోదాలో రఘువీరారెడ్డి కేసీఆర్‌కు లేఖ రాయడం తెలంగాణ కాంగ్రెస్‌కు ఇబ్బందికర పరిణామంగా మారిందనే చెప్పాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, AP Congress, AP News, AP Politics, AP Special Status, CM KCR, Congress, Raghuveera Reddy, Telangana Politics, Ys jagan mohan reddy