• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • AP CONGRESS PRESIDENT SAILAJANATH SLAMS BJP PUDUCHCHERY MANIFESTO ON SPECIAL STATUS NGS

special status: బీజేపీ మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా? గెలిస్తే ప్రత్యేక హోదా ఇస్తామంటూ హామీ: కేంద్రం తీరుపై ప్రత్యర్థి పార్టీల ఫైర్

special status: బీజేపీ మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా? గెలిస్తే ప్రత్యేక హోదా ఇస్తామంటూ హామీ: కేంద్రం తీరుపై ప్రత్యర్థి పార్టీల ఫైర్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (File)

ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అధ్యాయమని పదే పదే చెబుతూ వస్తున్న కేంద్రం.. ఇప్పుడు అదే హామీని తెరపైకి తెచ్చింది. నేరుగా తమ మేనిఫెస్టోలో పెట్టింది. దీనిపై ఏపీలో వివిధ రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి. ఇంతకాలం బీజేపీ చెప్పినవన్నీ అబద్ధాలేనా అని ప్రశ్నిస్తున్నాయి.

  • Share this:
    ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం. ఇకపై ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదు? కేంద్రం పదేపదే చెబుతున్న మాటలు ఇవి. రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదాను ప్రకటించింది. అప్పుడు రాజ్యసభలో ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న వెంకయ్య నాయుడు.. ప్రత్యేకహోదాను ఐదేళ్లు కాదు.. పదేళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ ఎన్నికల ముందు ఏపీ వచ్చిన బీజేపీ నేతలు సైతం ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ హామీలు కురిపించారు. కానీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ప్రత్యేక హోదా హామీ అటక ఎక్కింది.

    నీతి ఆయోగ్ సూచనల ప్రకారం ఇకపై ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని.. ఇప్పటికే హామీలు ఉన్నవాటికి కూడా ఆ హోదా రద్దు చేస్తున్నామని కేంద్రం స్పష్టం చేసింది. విభజన సందర్భంగా ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని ఏపీ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగాయి.. ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రత్యేక హోదా కోసం పోరాటం చేశాయి. కానీ కేంద్రం ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అధ్యాయమని.. ఇక ఏ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పేసింది. రాష్ట్ర బీజేపీ నేతలు సైతం ఇక ప్రత్యేక హోదా అన్నది లేదని.. ప్రత్యేక ప్యాకేజీ మాత్రం కేంద్రం ఇస్తోందని పదే పదే చెబుతూ వస్తున్నారు. తాజాగా తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో బీజేపీ అభ్యర్థి రత్న ప్రభ సైతం దీనిపై క్లారిటీ ఇచ్చారు. అసలు ప్రత్యేక హోదా అన్న డిమాండే తప్పు అన్నారు.

    దీంతో దాదాపు అన్ని రాజకీయ పార్టీలు బయటకు ప్రత్యేక హోదాపై పోరాడుతామని చెబుతున్నా.. ఇక రాదని ఫిక్స్ అయిపోయాయి. ఆ విషయంలో కేంద్రంతో పోరాడడం కుదరదని ఫిక్స్ అయిపోయాయి. 22 మంది ఎంపీలు నెగ్గిన వైసీపీ అధినేత జగన్ కూడా.. కేంద్రాన్ని ప్రశ్నించలేం అని చేతులు ఎత్తేశారు. కలిసిన ప్రతిసారి ప్రత్యేకహోదా ఇవ్వమని అడగడం తప్పా.. ఒప్పించంలేమని చెప్పేశారు. ఇలా ఇక ప్రత్యేక హోదా అంశమే లేదని చెబుతూ వస్తున్న బీజేపీ పెద్దలు ఇప్పుడు.. ప్రత్యేక హోదా హామీ ఇవ్వడంపై ఏపీలో రాజకీయపార్టీలు మండిపడుతున్నాయి. దేశంలోని ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రస్తుతం పుదుచ్చేరి రాష్ట్రానికి కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన మ్యానిఫెస్టోను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రిలీజ్ చేశారు. ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే పుదుచ్చేరికి స్పెషల్ స్టేటస్ ఇస్తామని పేర్కొన్నారు. దీనిపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే దేశంలో ఏ రాష్ట్రానికి కొత్తగా స్పెషల్ స్టేటస్ ఇవ్వడం సాధ్యం కాదని ఒకవైపు చెబుతూనే.. ఇప్పుడు పుదుచ్చేరికి స్పెషల్ స్టేటస్ ఎలా ఇస్తారని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శైలజానాథ్ ప్రశ్నించారు. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వడం సాధ్యం కాదని చెప్పిన బీజేపీ, ఇప్పుడు పుదుచ్చేరికి ఎలా ఇస్తానని హామీ ఇస్తోందని ఆయన ప్రశ్నించారు. తిరుపతి సాక్షిగా అప్పట్లో బీజేపీ హామీ ఇచ్చిందని, హామీని నెరవేర్చకుండా తిరుపతి ఉప ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తుందని శైలజానాథ్ విమర్శించారు. పాచిపోయిన లడ్డూలు ఎవరికీ కావాలి అని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు అదే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని, చంద్రబాబు కూడా బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తున్నారని శైలజానాథ్ విమర్శలు చేశారు. ఇప్పటికైనా ఏపీలో అధికార వైసీపీ స్పెషల్ స్టేటస్ అంశంపై పోరాటం చేయాలని పిలుపు ఇచ్చారు.
    Published by:Nagesh Paina
    First published:

    అగ్ర కథనాలు