సెల్ఫీలు, ముద్దులు, రోజుకు రూ. 2 కోట్ల ఖర్చు... జగన్ పాదయాత్రపై కాంగ్రెస్ సెటైర్

రఘువీరారెడ్డి(ఫైల్ ఫోటో)

AP congress chief Raghuveera reddy on YS Jagan Padayatra | జగన్ పాదయాత్ర ముగింపు కార్యక్రమంపై స్పందించిన ఏపీ కాంగ్రెస్ చీఫ్ రఘువీరారెడ్డి... వైసీపీ అధినేత పాదయాత్ర గురించి ఆ పార్టీ గొప్పలు చెప్పుకుంటోందని విజయవాడలో అన్నారు. వైసీపీ అధినేత పాదయాత్రకు ప్రజల నుంచి ఆశించిన స్పందన రాలేదని అన్నారు.

  • Share this:
    వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రపై కాంగ్రెస్ వ్యంగాస్త్రాలు సంధించింది. జగన్ పాదయాత్ర ముగింపు కార్యక్రమంపై స్పందించిన ఏపీ కాంగ్రెస్ చీఫ్ రఘువీరారెడ్డి... వైసీపీ అధినేత పాదయాత్ర గురించి ఆ పార్టీ గొప్పలు చెప్పుకుంటోందని విజయవాడలో అన్నారు. జగన్ పాదయాత్రలో సెల్ఫీలు, నెత్తిమీద ముద్దులు తప్ప ఏమీ లేవని ఆయన సెటైర్లు వేశారు. జగన్ పాదయాత్ర కోసం వైసీపీ రోజుకు రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని రఘువీరా ఆరోపించారు. జగన్ పాదయాత్రకు ప్రజల నుంచి ఆశించిన స్పందన రాలేదని అన్నారు.

    రాష్ట్రంలో టీడీపీతో పొత్తు అంశంపై రఘువీరారెడ్డి స్పందించారు. టీడీపీతో పొత్తుపై త్వరగా తేల్చాలని తాము అధిష్టానాన్ని కోరినట్టు తెలిపారు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్ కూటములు మాత్రమే ఉంటాయన్న రఘువీరారెడ్డి... కేసీఆర్ చెబుతున్న ఫెడరల్ ఫ్రంట్ ఒక మిథ్య అని వ్యాఖ్యానించారు. కొద్ది రోజుల క్రితం ఈ అంశంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలిసి చర్చలు జరిపిన ఏపీ కాంగ్రెస్ చీఫ్ రఘువీరా... పొత్తులపై తమ అభిప్రాయాలను ఢిల్లీ పెద్దలకు వివరించారు. పొత్తులపై రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతల మనోగతం ఎలా ఉందనే అంశాన్ని హైకమాండ్‌కు చెప్పిన రాష్ట్ర కాంగ్రెస్... పొత్తులపై తుది నిర్ణయాన్ని రాహుల్ గాంధీకి వదిలేసింది.

    First published: