ఆ పత్రికా కథనం అవాస్తవం... ఏపీ సీఎం కార్యాలయం సీరియస్

నిన్నటి సమావేశంలో రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు తప్ప మరే ఇతర విషయాలూ చోటు చేసుకోలేదన్నారు.

news18-telugu
Updated: September 24, 2019, 10:02 AM IST
ఆ పత్రికా కథనం అవాస్తవం... ఏపీ సీఎం కార్యాలయం సీరియస్
సీఎం వైఎస్ జగన్
  • Share this:
సోమవారం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంతగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ పలు అంశాలపై చర్చించారు. అయితే...కేంద్రంపై ఇద్దరు ముఖ్యమంత్రులు అసంతృప్తిగా ఉన్నారంటూ కొన్ని వార్తా పత్రికల్లో కథనాలు వచ్చాయి. అయితే.... ఆ కథనాలపై ఏపీ సీఎం కార్యాలయం స్పందించింది. ఆ కథనాల్ని కల్పితమని పేర్కింది. ముఖ్యమంత్రుల సమావేశంలో అలాంటి అంశం ఏదీ ప్రస్తావనకు రాలేదని ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. ఊహాజనిత అంశాలు రాసి ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని పేర్కొంది. సదరు వార్త రాసిన దినపత్రిక కథనాన్ని ఖండిస్తున్నామన్నారు. ఉద్దేశపూర్వకంగా రాసిన కథనంగా భావిస్తున్నామన్నారు.

ఇరురాష్ట్రాల ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా ఈ సమావేశం సాగిందన్నారు. గత నాలుగు నెలలుగా ఉభయ రాష్ట్రాల ప్రయోజనాల లక్ష్యంగా ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య సమావేశాలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. రాజకీయ అంశాలు, రాజకీయ సమీకరణాలకు దూరంగా ఈ సమావేశాలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందేనని సీఎం కార్యాలయం తెలిపింది. గోదావరి జలాలను తరలింపుద్వారా సాగర్‌ కుడికాల్వ కింద ఉన్న కృష్ణాడెల్టా, ప్రకాశం సహా రాయలసీమకూ, తెలంగాణలోని పాత మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు మేలు చేకూర్చే అంశంపై సుదీర్ఘ చర్చలు జరిగాయన్నారు సీఎం కార్యాలయ అధికారులు. ఈ ప్రాజెక్టును సఫలం చేసే దిశగా నిశితంగా ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించారన్నారు.

అపరిష్కృతంగా ఉన్న విభజన అంశాలను కూడా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించారన్నారు.

పోలీసు అధికారులకు సంబంధించిన విభజన అంశాలు కూడా చర్చకు వచ్చాయన్నారు. తెలంగాణలో కొత్తగా నియామకం అవుతున్న పోలీస్‌కానిస్టేబుళ్లకు ఏపీలోకూడా శిక్షణ ఇచ్చే అంశంపైనా చర్చ జరిగిందన్నారు. విద్యుత్‌ ఉద్యోగుల సమస్యలపైనా ఇద్దరు ముఖ్యమంత్రులు దృష్టిపెట్టారన్నారు. నిన్నటి సమావేశంలో రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు తప్ప మరే ఇతర విషయాలూ చోటు చేసుకోలేదన్నారు. ఇలాంటి సమావేశంమీద ఊహాజనిత అంశాలు రాసి ప్రజలను తప్పుదోవ పట్టించడం దురదృష్టకరమన్నారు.ఇలాంటి కథనాలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.

First published: September 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు