ఇకపై వాటిల్లో మంత్రుల ఫోటోలు కనిపించవద్దు.. ఏపీ సీఎంవో ఆదేశాలు..

సోషల్ మీడియా, ఔట్ డోర్ ప్రచారాల్లో సీఎం ఫోటో తప్ప మంత్రుల ఫోటోలేవి వాడవద్దని ఏపీ సీఎంవో అధికారులు స్పష్టమైన ఆదేశాలిచ్చారు.

news18-telugu
Updated: December 8, 2019, 4:32 PM IST
ఇకపై వాటిల్లో మంత్రుల ఫోటోలు కనిపించవద్దు.. ఏపీ సీఎంవో ఆదేశాలు..
ఏపీ సీఎం జగన్
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో ఇకపై ప్రభుత్వ పథకాల ప్రచారంలో మంత్రుల ఫోటోలు కనిపించవు. కేవలం సీఎం జగన్ ఫోటోను మాత్రమే అందుకు వాడుకోవాలని సీఎంవో అధికారులు ఆదేశాలు జారీ చేశారు. గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని.. జిల్లా కలెక్టర్లు దానికి అనుగుణంగా వ్యవహరించాలని ఆదేశించారు. సోషల్ మీడియా, ఔట్ డోర్ ప్రచారాల్లో సీఎం ఫోటో
తప్ప మంత్రుల ఫోటోలేవి వాడవద్దని స్పష్టమైన ఆదేశాలిచ్చారు.సుప్రీం కోర్టు గతంలోనే దీనికి సంబంధించిన ఆదేశాలిచ్చినప్పటికీ.. టీడీపీ ప్రభుత్వం ఆ ఆదేశాలను పట్టించుకోలేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా అదే రకంగా వ్యవహరిస్తున్నారు. ఈ ధోరణిలో మార్పు రావాలని భావించిన సీఎం జగన్.. పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని సూచన చేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు సీఎంవో వర్గాల నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో ఇప్పటినుంచి ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వాల్ పోస్టర్స్,ఫ్లెక్సీలు,పాంప్లెట్స్‌లో మంత్రుల ఫోటోలు కనిపించవనే చెప్పాలి.

ఇదిలా ఉంటే,ఈ నెల 23,24,25 తేదీల్లో సీఎం జగన్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ది కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.జమ్మలమడుగులో స్టీల్‌ ప్లాంట్‌, మైదుకూరులో కుందు ప్రాజెక్ట్, రాయచోటిలో హంద్రినీవా ప్రాజెక్టులకు సీఎం జగన్‌ శంకుస్థాపన చేస్తారు.

First published: December 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>