ఏపీలో మరో కొత్త పథకం.. రేపే ప్రారంభించనున్న జగన్

వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పథకం కింద చికిత్స చేయించుకున్న రోగులకు విశ్రాంతి సమయంలో నెలకు రూ.5వేల సాయం చేయాలని ప్రభుత్వం సంకల్పించింది.

news18-telugu
Updated: December 1, 2019, 8:18 PM IST
ఏపీలో మరో కొత్త పథకం.. రేపే ప్రారంభించనున్న జగన్
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ సీఎం
  • Share this:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 2న సోమవారం ఓ కొత్త పథకాన్ని ప్రారంభించనున్నారు. వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పథకం కింద చికిత్స చేయించుకున్న రోగులకు విశ్రాంతి సమయంలో నెలకు రూ.5వేల సాయం చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ పథకానికి రేపు శ్రీకారం చుట్టనున్నారు. గుంటూరులో ఈ పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. సోమవారం ఉదయం 10.30 గంటలకి తాడేపల్లి నివాసం నుంచి జగన్ బయలుదేరతారు. 11.20 గంటలకి ప్రభుత్వ సర్వజన వైద్యశాలకి చేరుకుని రోగులకు చెక్కుల పంపిణీ చేస్తారు. 11.40 గంటలకి గుంటూరు మెడికల్ కాలేజీ జింఖానా ఆడిటోరియం చేరుకుంటారు. 12.15 - 12.40 సీఎం జగన్ ఈ పథకాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. దీనికి అధికారులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.

First published: December 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>