తన పథకాన్ని తానే టెస్ట్ చేసిన సీఎం జగన్.. ఓ సాధారణ పౌరుడిలా...

ఇసుక అక్రమ రవాణాను నిరోధించేందుకు, అక్రమాలు, ఎక్కువ ధరకు ఇసుక అమ్మకాలను కట్టడి చేసేందుకు సీఎం జగన్ ప్రభుత్వం శాండ్ టోల్ ఫ్రీ నెంబర్ 14500 తీసుకొచ్చింది.

news18-telugu
Updated: November 21, 2019, 6:34 PM IST
తన పథకాన్ని తానే టెస్ట్ చేసిన సీఎం జగన్.. ఓ సాధారణ పౌరుడిలా...
సీఎం జగన్
  • Share this:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓ సాధారణ పౌరుడిలా మారిపోయారు. తాను కొత్తగా తీసుకొచ్చిన హెల్ప్‌లైన్‌ను తానే టెస్ట్ చేశారు. ఓ సాధారణ పౌరుడిలా కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. అసలు విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల ఇసుక మీద తీవ్ర రాజకీయ దుమారం రేగింది. రాష్ట్రంలో ఇసుక అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలిపోతుండగా, ప్రజలకు మాత్రం దొరకడం లేదని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఈ క్రమంలో ఇసుక అక్రమ రవాణాను నిరోధించేందుకు, అక్రమాలు, ఎక్కువ ధరకు ఇసుక అమ్మకాలను కట్టడి చేసేందుకు సీఎం జగన్ ప్రభుత్వం శాండ్ టోల్ ఫ్రీ నెంబర్ 14500 తీసుకొచ్చింది. ఇసుక అక్రమ రవాణా, ఇతర అంశాలపై ఆ నెంబర్‌కు ఫోన్ చేసి ఎవరైనా వివరాలు తెలుసుకోవచ్చు.

ఈ ప్రోగ్రాం ప్రారంభం సందర్భంగా సీఎం జగన్ 14500 కాల్ సెంటర్‌కు ఫోన్ చేశారు. వెంటనే అక్కడి ఉద్యోగి స్పందించింది. అయితే, శాండ్ మైనింగ్ హెల్ప్‌లైన్ అని అనడంతో ‘ఇసుక హెల్ప్‌లైన్’ అంటే బాగుంటుందని జగన్ సూచించారు. అదే సమయంలో వెంటనే పక్కన ఉన్న అధికారులు జోక్యం చేసుకుని, ‘సీఎం జగన్ మాట్లాడుతున్నారు.’ అని చెప్పారు. అనంతరం హెల్ప్‌లైన్ ఉద్యోగి మామూలుగానే స్పందించింది. ‘ఇసుకను ఎక్కువ రేటుకు అమ్మితే ఏం చేస్తారు?’ అని జగన్ ప్రశ్నించగానే.. ‘ఫిర్యాదు తీసుకుంటాం. తప్పు చేసిన వారికి జరిమానా, జైలు శిక్ష ఉంటుంది.’ అని తెలిపింది. దీనిపై జగన్ సంతృప్తి వ్యక్తం చేశారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: November 21, 2019, 6:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading