జగన్ సంచలన నిర్ణయం.. వచ్చే ఏడాది నుంచి డిగ్రీ నాలుగేళ్లు, ఇంజినీరింగ్ ఐదేళ్లు?

కాలేజీల్లోనే తగిన నైపుణ్యం పొందేందుకు ఒక సంవత్సరం అదనంగా అప్రెంటిస్ షిప్ ప్రోగ్రాంని ప్రవేశపెట్టాలని జగన్ నిర్ణయించారు.

news18-telugu
Updated: November 30, 2019, 9:52 PM IST
జగన్ సంచలన నిర్ణయం.. వచ్చే ఏడాది నుంచి డిగ్రీ నాలుగేళ్లు, ఇంజినీరింగ్ ఐదేళ్లు?
ఏపీ సీఎం జగన్(ఫైల్ ఫోటో)
  • Share this:
ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా విద్యావిధానంలో సంచలన మార్పులు చేసేందుకు జగన్ సన్నద్ధమైనట్టు తెలిసింది. డిగ్రీ, ఇంజినీరింగ్ విద్యార్థులకు.. ఉద్యోగాల కల్పన కోసం అవసరమైన నైపుణ్యాన్ని అందించేందుకు సంకల్పించారు. ఇందులో భాగంగా ఒక సంవత్సరం అదనంగా అప్రెంటిస్ షిప్ ప్రోగ్రాం మొదలుపెట్టేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఉన్నత విద్యామండలికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డిగ్రీ మూడేళ్లు.. ఇంజినీరింగ్ నాలుగేళ్లలో పూర్తి అవుతుందన్న విషయం తెలిసిందే. గ్రాడ్యుయేషన్ తర్వాత విద్యార్దులందరూ డిగ్రీ పట్టాలు తీసుకుని ఉద్యోగాలకు ప్రయత్నించే విషయంలో విఫలమవుతూనే ఉన్నారు. చదివిన విద్య మీద పట్టు లేకపోవడం, తగిన నైపుణ్యం పొందకపోవడం ఇలా ఎన్నో కారణాలు ఉన్నాయి. దీంతో ఉద్యోగాలు సాధించేందుకు యువత వేరే కోర్సులు నేర్చుకునేందుకు కోచింగ్ సెంటర్ల బాట పడుతున్నారు. అందుకే ఇకపై ఆ బెడద ఉండకూడదని.. కాలేజీల్లోనే తగిన నైపుణ్యం పొందేందుకు ఒక సంవత్సరం అదనంగా అప్రెంటిస్ షిప్ ప్రోగ్రాంని ప్రవేశపెట్టాలని జగన్ నిర్ణయించారు. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి కసరత్తులు కూడా మొదలు పెట్టింది.

అంతేకాకుండా ఈ అప్రెంటిస్ షిప్ వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలులోకి రానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ ప్రోగ్రాంలో చేరే విద్యార్థుల ఫీజులు, వసతి, భోజనానికి అయ్యే ఖర్చులన్నీ కూడా ప్రభుత్వమే చెల్లించనుంది. కాగా, రాష్ట్రంలో జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ.. జిల్లాల వారీగా సర్వే చేసి.. ఏయే రంగాలు విద్యార్థులకు ఉపయోగపడతాయో తెలుసుకుని.. వాటిని కోర్సులుగా అందించనున్నారు.
First published: November 30, 2019, 9:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading