అమెరికాలో జగన్ టూర్.. చంద్రబాబును ‘తలదన్నే’ ప్లాన్

చంద్రబాబు తరహాలోనే తన హయాంలో కూడా ఓ మెగా ప్రాజెక్టును రాష్ట్రానికి తీసుకొచ్చి తన సత్తా చాటాలని ఆయన కృతనిశ్చయంతో ఉన్నారు.

news18-telugu
Updated: August 18, 2019, 5:09 PM IST
అమెరికాలో జగన్ టూర్.. చంద్రబాబును ‘తలదన్నే’ ప్లాన్
అమెరికాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన
  • Share this:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమెరికాలో పర్యటిస్తున్నారు. అక్కడి ప్రవాసభారతీయులతో చర్చించి.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరుతున్నారు. జన్మభూమిలో పెట్టుబడులు పెట్టి రాష్ట్రాభివృద్ధికి తోడ్పాటు అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈనెల 24 వరకు జగన్ మోహన్ రెడ్డి అమెరికా యాత్ర కొనసాగుతుంది. అయితే, అన్నిటికంటే ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబునాయుడిని తలదన్నే ప్లాన్‌తో అమెరికాలో అడుగుపెట్టినట్టు తెలుస్తోంది. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ వంటి వారు హైదరాబాద్ వచ్చారు. దీంతోపాటు దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ కియా మోటార్స్ కూడా చంద్రబాబునాయుడి హయాంలోనే ఏపీకి వచ్చింది. అయితే, చంద్రబాబు తరహాలోనే తన హయాంలో కూడా ఓ మెగా ప్రాజెక్టును రాష్ట్రానికి తీసుకొచ్చి తన సత్తా చాటాలని ఆయన కృతనిశ్చయంతో ఉన్నారు.

ఇటీవల విజయవాడలో జరిగిన వివిధ దేశాల కాన్సులేట్ జనరల్స్, రాయబారులతో జరిగిన సమావేశంలో కూడా జగన్ మోహన్ రెడ్డి ఇదే లక్ష్యంతో అడుగులు వేశారు. రాష్ట్రంలో చంద్రబాబును తలదన్నే ఓ కంపెనీని తీసుకొచ్చి చరిత్రలో నిలిచిపోవాలని ఆయన భావిస్తున్నారు. తాజాగా అమెరికా టూర్‌లో కూడా జగన్ మోహన్ రెడ్డి దానిపైనే ప్రధానంగా దృష్టి సారించినట్టు తెలుస్తోంది.

First published: August 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు