వాట్ యాన్ ఐడియా.. రెడ్డిలను కూల్ చేసేందుకు జగన్ ప్లాన్

YS Jagan Cabinet | జగన్ మోహన్ రెడ్డి కేబినెట్‌లో కేవలం నలుగురు రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారికే మంత్రి పదవులు దక్కాయి. దీనిపై ఆ సామాజికవర్గం అసంతృప్తితో ఉంది.

news18-telugu
Updated: June 12, 2019, 7:01 PM IST
వాట్ యాన్ ఐడియా.. రెడ్డిలను కూల్ చేసేందుకు జగన్ ప్లాన్
ఏపీ అసెంబ్లీలో వైఎస్ జగన్
news18-telugu
Updated: June 12, 2019, 7:01 PM IST
ఏపీలో కేబినెట్ బెర్తులు దక్కలేదనే ఆవేదనతో ఉన్న రెడ్డి సామాజిక వర్గ ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు సీఎం జగన్ చేస్తుున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. మహిళా కోటాలో కేబినెట్ బెర్తు ఆశించిన నగరి ఎమ్మెల్యే ఆర్.కె.రోజాకు ఏపీఐఐసీ ( ఏపీ పారిశ్రామిక, మౌలిక వసతుల అభివద్ధి సంస్ధ) ఛైర్మన్ పదవి ఇవ్వాలని నిర్ణయించిన జగన్.. మంగళగిరిలో నారా లోకేష్ పై గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డికి సీఆర్డీఏ ఛైర్మన్ పదవి ఆఫర్ చేశారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్ని రామకృష్ణారెడ్డి, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డికి విప్ పదవులు కేటాయించారు. మొన్నటి ఏపీ కేబినెట్ విస్తరణలో చోటుదక్కని రెడ్డి సామాజిక వర్గ ఎమ్మెల్యేలకు బుజ్జగించేందుకు రెండ్రోజులుగా సీఎం జగన్ చేసిన ప్రయత్నాలు ఫలించినట్లే కనిపిస్తోంది. భవిష్యత్తుపై భరోసా ఇస్తూనే ప్రస్తుతానికి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని జగన్ తీసుకున్న నిర్ణయం మేరకు తన సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను బుజ్జగిస్తున్నారు. ఇప్పటికే జగన్ తో భేటీ అయిన నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు ఏపీఐఐసీ ఛైర్మన్ పదవి ఇవ్వాలని నిర్ణయించారు. జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని ఇప్పటికే ప్రకటించిన రోజా.. ఆ మేరకు ఏపీఐఐసీ ఛైర్మన్ పదవి తీసుకోవాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

alla rama krishna reddy, alla ramakrishna reddy, mla alla rama krishna reddy, mla alla ramakrishna reddy, mangalagiri ycp mla alla rama krishna reddy, ycp mla alla ramakrishna reddy, mangalagiri mla alla ramakrishna reddy, ycp mla alla rama krishna reddy, ysrcp mla alla rama krishna reddy, alla rama krishna reddy ticket issue, alla rama krishna reddy latest speech, ycp mla, jagan ycp, ఆళ్ల రామకృష్ణా రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే, ఆర్కే మంగళగిరి సీటు, మంగళగిరి సీట్, మంగళగిరి
జగన్, ఆళ్ల రామకృష్ణారెడ్డి (Image : Twitter)


రోజా, ఆర్కే తరహాలోనే మంత్రి పదవులు రాకపోవడంపై అసంతృప్తిగా ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పిన్నెల్ని రామకృష్ణారెడ్డితో పాటు కాపు సామాజిక వర్గానికి చెందిన సామినేని ఉదయభాను, బోయ సామాజిక వర్గానికి చెందిన కాపు రామచంద్రారెడ్డికి సైతం విప్ లుగా నియమించారు. తద్వారా అసంతృప్తులను కాస్త బుజ్జగించినట్లయింది. రాబోయే రోజుల్లో మరికొందరు అసంతృప్తులను సైతం నామినేటెడ్ పదవులు ఇవ్వడం ద్వారా బుజ్జగించాలని వైసీపీ భావిస్తోంది. ఏపీ అసెంబ్లీ తొలి సమావేశాలు ముగిసిన తర్వాత పదవుల భర్తీ ఉంటుందని వైసీపీ సీనియర్ నేతలు ఇప్పటికే ప్రకటించారు.

(సయ్యద్ అహ్మద్, అమరావతి కరస్పాండెంట్, న్యూస్‌18)

First published: June 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...