‘మీరే నా కళ్లు, చెలువు..’ కలెక్టర్లకు సీఎం జగన్ కొత్త టాస్క్...

జిల్లాల్లో కలెక్టర్లు కిందిస్థాయి సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్‌లు మాని.. క్షేత్రస్థాయిలో పర్యటించాని సీఎం జగన్ ఆదేశించారు.

news18-telugu
Updated: December 1, 2019, 10:15 PM IST
‘మీరే నా కళ్లు, చెలువు..’ కలెక్టర్లకు సీఎం జగన్ కొత్త టాస్క్...
సీఎం వైఎస్ జగన్(ఫైల్ ఫోటో)
  • Share this:
వీడియో కాన్ఫరెన్స్‌ల కన్నా, జిల్లాలో విస్తృతంగా పర్యటించాలని, నెలలో కనీసం 15 రోజులు క్షేత్రస్థాయి పర్యటనలో ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌ల కన్నా, క్షేత్రస్థాయి పర్యటనల వల్లే సరైన ఫీడ్‌ బ్యాక్‌ వస్తుందన్నారు. దీనివలన ప్రజలు, లబ్ధిదారులు, తదితర వర్గాల నుంచి వచ్చే సమాచారం చాలా కీలకం అని స్పష్టం చేశారు. కలెక్టర్లు ఆకస్మిక తనిఖీలు చేయాలని స్పష్టం చేశారు. రాత్రి పూట ఆస్పత్రులు, హాస్టల్స్, పల్లెల్లో నిద్ర చేయాలని స్పష్టం చేశారు. దీని వల్ల క్షేత్రస్థాయి పర్యటనలు మెరుగుపడతాయన్నారు. కొంతమంది జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయికి పెద్దగా వెళ్లడం లేదన్న విషయం తన దృష్టికి వచ్చిందన్న సీఎం, ఈ పరిస్థితి మారాలన్నారు. పరిపాలనలో జిల్లా కలెక్టర్లే తనకు కళ్లు, చెవులు వంటి వారని, ప్రజలు, ప్రభుత్వానికి కలెక్టర్లు ఒక వారధిలా ఉండాలన్నారు.

కలెక్టర్లకు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు


  1. కలెక్టర్లు వెంటనే వీడియా కాన్ఫరెన్సులు తగ్గించి, వెంటనే క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టాలి

  2. నెలలో కనీసం 15 రోజుల పాటు జిల్లాలో పర్యటించాలి  3. పథకాల అమలుకు సంబంధించి అధికారుల నుంచి వివరాలు పొందడం కంటే, నేరుగా లబ్ధిదారులతో మాట్లాడితే సరైన ఫీడ్‌బ్యాక్‌ వస్తుంది

  4. ప్రజలు, లబ్ధిదారులు ఇచ్చే సమాచారం ప్రభుత్వానికి ఎంతో ముఖ్యం
  5. మండల స్థాయి అధికారులతో ఇక నుంచి వారానికి రెండు సార్లు మాత్రమే వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాలి

  6. మంగళవారం ముఖ్యమంత్రితో వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం ఒకసారి, వారంలో రెండో దఫా మరోసారి మాత్రమే కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాలి

  7. ప్రతి కలెక్టర్‌ తప్పనిసరిగా వారంలో ఒకసారి జిల్లా కేంద్రం వెలుపల హాస్టల్స్ లేదా ఆస్పత్రిలో ఎక్కడో ఒక చోట నిద్ర చేయాలి.

First published: December 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>