హోమ్ /వార్తలు /రాజకీయం /

టీడీపీ నుంచి వల్లభనేని వంశీ, మద్దాలి గిరి మైనస్... అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటన...

టీడీపీ నుంచి వల్లభనేని వంశీ, మద్దాలి గిరి మైనస్... అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటన...

సీఎం జగన్ మోహన్ రెడ్డి (File)

సీఎం జగన్ మోహన్ రెడ్డి (File)

151 మంది ఎమ్మెల్యేలు ఉన్న తమ పార్టీ నుంచి కేవలం ఏడుగురు సభ్యులు మాట్లాడితే, కేవలం 21 మంది ఉన్న వాళ్ల పార్టీలో ఐదుగురు సభ్యులు ప్రసంగించారని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు టీడీపీని షాక్‌లో పడేశాయి. అసెంబ్లీ సాక్షిగా టీడీపీ తరఫున గెలిచిన వల్లభనేని వంశీ, మద్దాలి గిరిలను ఆ పార్టీ నుంచి మైనస్ చేసేశారు సీఎం జగన్. చంద్రబాబునాయుడు ఎక్కువసేపు మాట్లాడుతున్నారంటూ ఆయన మైక్‌ను స్పీకర్ కట్ చేశారు. వెంటనే సీఎం జగన్ మాట్లాడాలని స్పీకర్ తమ్మినేని సీతారాం సూచించారు. ఈ సందర్భంగా మాట్లాడిన జగన్... 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న తమ పార్టీ నుంచి కేవలం ఏడుగురు సభ్యులు మాట్లాడితే, కేవలం 21 మంది ఉన్న వాళ్ల పార్టీలో ఐదుగురు సభ్యులు ప్రసంగించారని చెప్పారు. వాస్తవానికి సంఖ్యాబలం పరంగా 23 మంది ఉన్నా.. టీడీపీకి దూరంగా ఉంటున్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్, గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్‌ టీడీపీ సభ్యులు కాదన్నట్టుగానే జగన్ మాట్లాడారు.

అంతకు ముందు మంత్రి కొడాలి నాని కూడా ఇలాంటి కామెంట్స్ చేశారు. అమరావతే రాజధానిగా ఉండాలని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు కోరుకుంటున్నట్టు టీడీపీ భావిస్తే ఆ పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని సవాల్ చేశారు. అంటే కొడాలి నాని కూడా వంశీ, గిరిలు టీడీపీ సభ్యులు కాదన్నట్టుగానే మాట్లాడారు.

First published:

Tags: Amaravati, Andhra Pradesh, Ap assembly sessions, Ap cm ys jagan mohan reddy, Chandrababu naidu, Tdp, Vallabhaneni vamsi

ఉత్తమ కథలు