కొత్త వెబ్‌సైట్ ప్రారంభించిన జగన్.. చంద్రబాబు బాటలోనే...

చంద్రబాబు హయాంలో నా ఇటుక నా అమరావతి వెబ్‌సైట్ తరహాలో జగన్ ప్రభుత్వం కనెక్ట్ టు ఆంధ్ర వెబ్ పోర్టల్‌ను తీసుకొచ్చింది. దాతల నుంచి నిధులను సమీకరించనున్నారు.

news18-telugu
Updated: November 8, 2019, 5:52 PM IST
కొత్త వెబ్‌సైట్ ప్రారంభించిన జగన్.. చంద్రబాబు బాటలోనే...
కనెక్ట్ టు ఆంధ్రా వెబ్‌పోర్టల్‌ను ప్రారంభిస్తున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి
  • Share this:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీలో కొత్తగా కనెక్ట్ టు ఆంధ్ర అనే వెబ్ పోర్టల్‌ను ప్రారంభించారు. అమరావతిలోని సచివాలయంలోని తన కార్యాలయంలో జగన్ మోహన్ రెడ్డి ఈ కనెక్ట్ టు ఆంధ్రా అనే పోర్టల్‌ను ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల కోసం తాము సాయం చేయాలనుకుంటే ఈ వెబ్ పోర్టల్ ద్వారా దాన్ని అందించవచ్చు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ కింద నిధులు, దాతలు, సంస్థలు, ప్రవాసాంధ్రుల నుంచి వచ్చే సాయం కోసం ఈ వెబ్‌సైట్‌ను రూపొందించారు. దీనికి ముఖ్యమంత్రి చైర్మన్‌గా ఉంటారు. చీఫ్ సెక్రటరీ వైస్ చైర్మన్‌గా ఉంటారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా సీఎం జగన్ పిలుపు నిచ్చారు. సొంత గ్రామంలో అమలవుతున్న నవరత్నాలు, నాడు–నేడు సహా, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు ఎవరైనా సహాయం చేయొచ్చుని చెప్పారు.

‘రాష్ట్రం మీద మీ ప్రేమాభిమానాలు చూపించడానికి ఇదొక మంచి అవకాశం. మీరు ఎంత సహాయం చేస్తారన్నది ముఖ్యంకాదు. మీ గ్రామానికి లేదా మీ నియోజకవర్గానికి లేదా మీ జిల్లాలో మీరు ఏ కార్యక్రమైనా చేపట్టవచ్చు. లేదా ఏ కార్యక్రమానికైనా ఎంత మొత్తమైనా సహాయం చేయవచ్చు. మెరుగైన రాష్ట్రం కోసం మీరు ఎంతోకొంత మంచిచేయడానికి ఖండాతరాల్లో ఉన్న వారంతా ముందుకు రావాలి’ అని జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు.

2014లో చంద్రబాబునాయుడు ఏపీ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజధాని కోసం అమరావతి పేరు మీద ఓ కొత్త వెబ్‌సైట్‌కు రూపకల్పన చేశారు. ‘నా ఇటుక - నా అమరావతి’ పేరుతో వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. అమరావతి నిర్మాణం కోసం ఎవరైనా సాయం చేయాలనుకుంటే దాని ద్వారా సాయం చేయవచ్చని కోరారు. దీనికి కొందరు స్పందించారు. అమరావతి  వెబ్ సైట్‌లో  ఉన్న వివరాల ప్రకారం ఇప్పటి వరకు 2,28,762 మంది స్పందించారు. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు నిధుల కోసం ఇలా కనెక్ట్ టు ఆంధ్రా పేరుతో వెబ్ పోర్టల్‌ను ప్రారంభించారు. జగన్ మోహన్ రెడ్డి నవరత్నాలు పేరుతో భారీ ఎత్తున సంక్షేమ పథకాలను ప్రకటించారు. అందులో మెజారిటీ పథకాలకు నిధుల అవసరం చాలా ఉంది. అసలే లోటు బడ్జెట్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ఇన్ని పథకాలు ఎలా అమలు చేస్తారని చాలామంది సందేహిస్తున్నారు. ఈ క్రమంలో నిధులను సమీకరించేందుకు సీఎం జగన్ ఇలా దాతల సాయం తీసుకుంటున్నారు. ఈ విధానం ద్వారా సుమారు రూ.1000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది.
Published by: Ashok Kumar Bonepalli
First published: November 8, 2019, 5:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading