Home /News /politics /

AP CM YS JAGANMOHAN REDDY INDIRECT COUNTER TO BJP MP SURESH PRABHU FOR MOCKING HIM OVER FREEBIES BA

తనపై లేఖ రాసిన బీజేపీ ఎంపీకి సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

సీఎం జగన్ (ఫైల్ ఫోటో)

సీఎం జగన్ (ఫైల్ ఫోటో)

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల ఓట్ల కోసం ఉచిత పథకాల పేరుతో సీఎం జగన్ మోహన్ రెడ్డి విపరీతంగా అప్పులు చేస్తున్నారంటూ బీజేపీ ఎంపీ సురేష్ ప్రభు కేంద్ర ఆర్థిక మంత్రికి లేఖ రాసిన విషయం తెలిసిందే.

    ఆంధ్రప్రదేశ్‌లో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాసిన బీజేపీ ఎంపీ సురేష్ ప్రభుకు ముఖ్యమంత్రి జగన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అయితే, నేరుగా కౌంటర్ ఇవ్వకుండా పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల ఓట్ల కోసం ఉచిత పథకాల పేరుతో సీఎం జగన్ మోహన్ రెడ్డి విపరీతంగా అప్పులు చేస్తున్నారంటూ బీజేపీ ఎంపీ సురేష్ ప్రభు కేంద్ర ఆర్థిక మంత్రికి లేఖ రాసిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం FRBM పరిధిని దాటి ప్రభుత్వం అప్పులు చేస్తోందని నిర్మలా సీతారామన్‌కు రాసిన లేఖలో సురేష్ ప్రభు పేర్కోన్నారు. రాష్ట్రాల కార్పొరేషన్లకు చెందిన నిధులను సంక్షేమ పథకాలకు మళ్లించడం ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. దీని వల్ల ఆర్థిక పురోగతి కుంటుపడటమే కాకుండా అభివృద్ధి క్షీణిస్తుందని సురేష్‌ ప్రభు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్ధితి ఆందోళనకరంగా మారిందని వ్యాఖ్యానించారు. ఏపీ ఆర్థిక పరిస్థితి చేయిదాటక ముందే సరైన చర్యలు తీసుకోవాలని నిర్మలా సీతారామన్‌ను సురేష్ ప్రభు కోరారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయెల్‌కు ఎంపీ సురేష్ ప్రభు ఈ మేరకు లేఖలు రాశారు.

    ఓ వైపు ఉచిత పథకాల మీద బీజేపీ ఎంపీ కేంద్ర ఆర్థిక మంత్రికి లేఖ రాసిన తర్వాత రోజే సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. తమ ప్రభుత్వం పేదల కోసం మరిన్ని పథకాలు తీసుకొస్తుందని ప్రకటించారు. పేదలకు సాయం చేసేందుకు ప్రస్తుతం నవరత్నాలు అమలు చేస్తున్నామని, రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందని అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అలాగే, ఇచ్చిన మాట ప్రకారం జూలై 8న వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఆసరా పెన్షన్లను రూ.2250 నుంచి రూ.2500కు పెంచుతామన ప్రకటించారు. అలా రూ.3000కు పెంచుతామని జగన్ స్పష్టం చేశారు.

    సురేష్ ప్రభు మహారాష్ట్రకు చెందిన వ్యక్తి అయినా.. ఆయన ప్రస్తుతం ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. గతంలో ఎన్డీయేకు మద్దతు ఇస్తున్న సమయంలో చంద్రబాబు సురేష్ ప్రభును ఏపీ నుంచి రాజ్యసభకు పంపించారు.

    కరోనా వల్ల జీఎస్టీ వసూళ్లు తగ్గిన నేపథ్యంలో రాష్ట్రాలకు రావాల్సిన నిధుల్లో కేంద్రం కోత పెట్టింది. ఈ క్రమంలో అదనపు నిధులు కావాలంటే కొన్ని సంస్కరణలు తీసుకురావాలంటూ కండిషన్లు పెట్టింది. వ్యవసాయ మీటర్ల ఏర్పాటుతో సహా పలు సంస్కరణలు అమలు చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. నిధుల కోసం కేంద్రం పెట్టిన అన్ని రకాల కండిషన్లను వైఎస్ జగన్ ప్రభుత్వం ఓకే చెబుతోంది. ఈ క్రమంలో ఉచిత పథకాల కోసం అప్పులు చేస్తున్నారంటూ జగన్ మీద సురేష్ ప్రభు లేఖ రాయడంతో దానికి సీఎం పరోక్షంగా కౌంటర్ ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Bjp, Nirmala sitharaman, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు