జగన్ గుడ్ న్యూస్... రైతులు, పెన్షన్ కోసం ఎదురుచూసే వారికి

YS Jagan mohan Reddy | కొత్తగా పెన్షన్ విధానాన్ని సీఎం ప్రారంభించారు. సెప్టెంబర్ 1 నుంచే ఇంటింటికీ పెన్షన్ ప్రారంభం అవుతుందని జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు.

news18-telugu
Updated: July 8, 2019, 3:18 PM IST
జగన్ గుడ్ న్యూస్... రైతులు, పెన్షన్ కోసం ఎదురుచూసే వారికి
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి
  • Share this:
అర్హత ఉన్నా కూడా పెన్షన్ జాబితాలో లేని వారు, పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న వారిని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. పెండింగ్‌లో ఉన్న 5లక్షల 40వేల మందికి కూడా పెన్షన్లు మంజూరు చేస్తున్నామని జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. రైతు దినోత్సవం సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి కడప జిల్లా జమ్మలమడుగులో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. కొత్తగా పెన్షన్ విధానాన్ని ఆయన ప్రారంభించారు. సెప్టెంబర్ 1 నుంచే ఇంటింటికీ పెన్షన్ ప్రారంభం అవుతుందని జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. అవ్వా తాతలకు నెలకు రూ.5వేలు, దివ్యాంగులకు రూ.3వేలు, డయాలసిస్ చేయించుకుంటున్న వారికి రూ.10వేల చొప్పున పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు. చంద్రబాబు హయాంలో పెన్షన్ల కోసం రూ.15,675 కోట్లు ఖర్చు పెడితే.. తమ ప్రభుత్వ హయాంలో అంతకంటే మూడు రెట్లు ఎక్కువ ఖర్చు పెడతామన్నారు.

రైతుల కోసం నెల రోజుల పాలనలోనే కొత్త పథకాలు తీసుకొచ్చామని జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ఇకపై వైఎస్ జయంతి రోజున ప్రతి ఏటా రైతు దినోత్సవం నిర్వహిస్తామన్నారు. రైతుల కోసం వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం తెచ్చినట్టు చెప్పారు. ఈ పథకం కింద రూ.84వేల కోట్లు రైతులకు రుణాలివ్వాలని నిర్ణయించామన్నారు. పంట రుణాలు గడువులోగా చెల్లిస్తే వడ్డీ ఉండదన్నారు. అన్నదాతల కోసం ఉచిత పంటల బీమా పథకాన్ని కూడా తెచ్చామన్న జగన్ మోహన్ రెడ్డి.. ఆ ఇన్సూరెన్స్ కోసం రూ.2164 కోట్లు చెల్లిస్తుందన్నారు. ఒకవేళ రైతులు పంట నష్టపోతే ప్రభుత్వమే బ్యాంకుల చుట్టూ తిరిగి బీమా డబ్బులు తెచ్చిస్తుందన్నారు. దీంతోపాటు గిట్టుబాటు ధరల కోసం రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసినట్టు జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. శనగరైతులు, పామాయిల్ రైతులు, ఇతర రైతులకు తాము చేపట్టిన పథకాలను జగన్ వివరించారు.

అక్టోబర్ 15 నుంచి రైతు భరోసా పథకం ప్రారంభం అవుతుందన్నారు. ఈ పథకం వల్ల 70లక్షల మంది రైతులు (16లక్షల మంది కౌలు రైతులు)కు లబ్ధి జరుగుతుందన్నారు. దీని కోసం రూ.8750 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారు. ఇంత భారీ మొత్తంలో ఒకేసారి రైతులకు అందజేయడం.. దేశ చరిత్రలో ఎక్కడా లేదన్నారు. భూ యజమానులకు నష్టం లేకుండా, కౌలు రైతులకు లాభం జరిగేలా.. కౌలు రైతుల చట్టంలో మార్పులు తెస్తామని జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చట్టంలో మార్పులు తీసుకొస్తామని చెప్పారు.

First published: July 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు