జగన్ ‘బెల్ట్‌’ తీశారు... మద్య నిషేధమే తరువాయి..

వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైతే... దశలవారీగా మద్యపానాన్ని నిషేధిస్తానని జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు.

news18-telugu
Updated: June 1, 2019, 4:03 PM IST
జగన్ ‘బెల్ట్‌’ తీశారు... మద్య నిషేధమే తరువాయి..
జగన్ మోహన్ రెడ్డి (File)
  • Share this:
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కసరత్తు ప్రారంభించారు. ప్రమాణస్వీకారం చేసిన వెంటనే వైఎస్ఆర్ పింఛను పథకాన్ని పెంచుతూ సంతకం పెట్టారు. ఆ తర్వాత ఏపీలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకానికి వైఎస్‌ఆర్ అక్షయపాత్రగా నామకరణం చేశారు. ఇందులో పని చేస్తున్న వాలంటీర్ల గౌరవ వేతనాన్ని రూ. 3 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలు దిశగా తొలి అడుగు వేశారు. రాష్ట్రంలో ఉన్న బెల్ట్ షాపులను తొలగించాలని జగన్ మోహన్ రెడ్డి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఆర్థిక, రెవిన్యూ శాఖల అధికారులతో జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తొలి విడుతలో బెల్ట్ షాపులను ఎత్తేయాలని అధికారులకు సూచించారు. బెల్ట్ షాపులను ఎత్తేయడం వల్ల ఎంత ఆదాయం తగ్గుతుందో అంచనా వేసి ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టాలని సూచించారు.

YS Jaganmohan Reddy,AP CM,CM Jagan,Jagan liquor ban,Jagan liquor shops,belt shops ban,belt shops ban in ap,ap liquor sales,ys jagan election promice,వైఎస్ జగన్ మోహన్ రెడ్డి,ఏపీ సీఎం,సీఎం జగన్,ఏపీలో మద్యపాన నిషేధం,ఏపీలో బెల్ట్ షాపులు బంద్,జగన్ రివ్యూ,Jagan review,బెల్ట్ షాపులు,
మద్యం


రాష్ట్రంలో అవసరమైతే ప్రభుత్వమే మద్యం షాపులను ఏర్పాటు చేయాలని, బెల్ట్ షాపులను మాత్రం ఉపేక్షించవద్దని జగన్ అధికారులకు సూచించారు. బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేసే వైన్ షాపులను గుర్తించి వాటి లైసెన్స్‌లు రద్దు చేయాలన్నారు. దశల వారి మద్యపాన నిషేధం అమలులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా చైతన్యం, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైతే... దశలవారీగా మద్యపానాన్ని నిషేధిస్తానని జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. మద్యం అనేది కేవలం ఫైవ్ స్టార్ హోటల్స్‌కు మాత్రమే పరిమితం అయ్యేలా చూస్తామన్నారు. ఈ క్రమంలో తొలి విడుతలో బెల్ట్ షాపులను కట్ చేశారు.

First published: June 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు