కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం జగన్ ‘పార్టీ’...

ప్రతి మంగళవారం అందరు కలెక్టర్లు, ఎస్పీలతో కలసి ఓ కాఫీ మీట్ నిర్వహిద్దామని సీఎం జగన్ గతంలో సూచించారు.

news18-telugu
Updated: December 14, 2019, 10:40 PM IST
కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం జగన్ ‘పార్టీ’...
ఏపీ సీఎం జగన్
  • Share this:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో మరో కొత్త తరహా ప్రయత్నం చేయనున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు ఆయన విందు ఇస్తున్నారు. ఈనెల 17న ఆయన వారికి విందు ఇవ్వనున్నారు. అమరావతిలో జరిగే ఈ విందు సమావేశానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. 13 జిల్లాలకు చెందిన కలెక్టర్లు, ఎస్పీలతో పాటు ఇతర సీనియర్ ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ఒక్కో జిల్లాకు ఒక్కో టేబుల్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఆ టేబుల్ వద్దకు సీఎం జగన్ స్వయంగా వస్తారు. ఆయా జిల్లాలకు సంబంధించిన సమస్యలను వారి నుంచి తెలుసుకుంటారు. ఒక్కో టేబుల్ వద్ద జగన్ 10 నిమిషాల చొప్పున కేటాయిస్తారని తెలిసింది. అంటే సుమారు 2 గంటలకు పైగా సీఎం జగన్ కలెక్టర్లు, ఎస్పీల వద్ద జగన్ వారిని కలుస్తారు. ఒక్కో జిల్లా మీద సమగ్రంగా అవగాహన తెచ్చుకుంటారు.

ప్రతి మంగళవారం అందరు కలెక్టర్లు, ఎస్పీలతో కలసి ఓ కాఫీ మీట్ నిర్వహిద్దామని సీఎం జగన్ గతంలో సూచించారు. చంద్రబాబునాయుడు హయాంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగేవి. ఒక్కోసారి రెండు రోజుల పాటు కూడా నిర్వహించేవారు. అయితే, దానికి భిన్నంగా జగన్ ఇలా విందు పార్టీని ఏర్పాటు చేసినట్టు తెలిసింది. ఒక్కో జిల్లాకు ప్రత్యేకంగా సమయం కేటాయించడం ద్వారా తమ జిల్లా మీద కూడా జగన్ దృష్టి పెట్టారని అధికారులకు సందేశం పంపినట్టు అవుతుంది. అదే సమయంలో ఏయే జిల్లాలో ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికతో ఉందనే విషయాన్ని ఆ జిల్లా వారికి మాత్రమే చెబితే సరిపోతుంది.
Published by: Ashok Kumar Bonepalli
First published: December 14, 2019, 10:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading