• HOME
 • »
 • NEWS
 • »
 • POLITICS
 • »
 • AP CM YS JAGANMOHAN REDDY DECIDES TO APPOINT YS SUBBA REDDY AS NEW TTD CHAIRMAN BA

జగన్ ఊహించని ఎత్తు.. టీటీడీ చైర్మన్‌గా ఆ నేత పేరు ఖరారు

జగన్ ఊహించని ఎత్తు.. టీటీడీ చైర్మన్‌గా ఆ నేత పేరు ఖరారు

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్‌‌గా తన బాబాయి వైవీ సుబ్బారెడ్డిని నియమిస్తూ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.

 • Share this:
  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఊహించని నిర్ణయం తీసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా తన బాబాయి వైవీ సుబ్బారెడ్డి పేరును ఖరారు చేశారు. ప్రస్తుతం తిరుమల తిరుపతి బోర్డు చైర్మన్‌గా పుట్టా సుధాకర్ యాదవ్ ఉన్నారు. ఆయన రాజీనామా చేయలేదు. దీంతో బోర్డును రద్దు చేసి కొత్త పాలకమండలిని ఏర్పాటు చేసేందుకు జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసినట్టు సమాచారం. ఈ క్రమంలో పుట్టా సుధాకర్ యాదవ్ స్థానంలో వైవీ సుబ్బారెడ్డికి టీటీడీ బోర్డు పగ్గాలు అప్పగించేందుకు జగన్ నిర్ణయించారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. టీటీడీ బోర్డు చైర్మన్‌గా ప్రముఖ నటుడు మోహన్ బాబుకు అవకాశం దక్కొచ్చని ప్రచారం జరిగింది. కానీ, తాను ఎలాంటి పదవులు ఆశించలేదని, తప్పుడు ప్రచారం వద్దంటూ ఏకంగా మోహన్ బాబు ప్రకటన ఇచ్చారు.

  వైవీ సుబ్బారెడ్డి 2014 ఎన్నికల్లో ఒంగోలు లోక్‌‌సభ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత జగన్ పిలుపుమేరకు పార్టీ ఎంపీలతో కలసి రాజీనామా చేశారు. 2019 ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీ నుంచి వచ్చి చేరడంతో ఆయనకు టికెట్ ఖరారు చేసిన జగన్ బాబాయ్‌ను పక్కన పెట్టారు. ఆ సమయంలో సుబ్బారెడ్డిని రాజ్యసభకు పంపుతామని హామీ ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. అయితే, ఇప్పుడు పెద్దల సభకు కాకుండా టీటీడీ చైర్మన్‌గా ఎంపిక చేయడం ద్వారా జగన్ ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నారు.
  First published:

  అగ్ర కథనాలు