ఏపీ కేబినెట్ టాప్ 10 నిర్ణయాలు.. బాలయ్యకు షాక్, వైఎస్ పేరుతో కొత్త స్కీం..

అమరావతిలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

news18-telugu
Updated: October 30, 2019, 5:00 PM IST
ఏపీ కేబినెట్ టాప్ 10 నిర్ణయాలు.. బాలయ్యకు షాక్, వైఎస్ పేరుతో కొత్త స్కీం..
వైఎస్ జగన్
  • Share this:
అమరావతిలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సుమారు 4 గంటల పాటు ఈ భేటీ జరిగింది. ఆ భేటీలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలు..

1. జనవరి 26 నుంచి అమ్మఒడి పథకం అమలు. ఒకటి నుంచి ఇంటర్ వరకు అమ్మఒడి పథకం అమలు. తల్లుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ. తల్లిదండ్రులు లేకపోతే సంరక్షకుల ఖాతాల్లో జమ

2. కృష్ణా, గోదావరి కెనాల్స్ క్లీనింగ్ మిషన్

3. గిరిజన ప్రాంతాల్లోని 77 మండలాల్లో చిన్న పిల్లలకు పౌష్టికాహారం కోసం నిధులు4. హజ్, జెరూసలేం యాత్రికులకు ఆర్థిక సాయం పెంపు

5. వివిధ రంగాల్లో ప్రతిభావంతులకు వైఎస్ఆర్ అచీవ్‌మెంట్ అవార్డులు. రూ.10లక్షల బహుమానం. వందమందికి ఇవ్వాలని నిర్ణయం

6.విశాఖలో లులు గ్రూప్ కు కేటాయించిన 13.83 ఎకరాలు (రూ.1500కోట్లు) విలువ చేసే భూమిని రద్దు
Loading...
7. వంద చదరపు గజాల్లోపు ఇంటి నిర్మాణం ఉంటే రూ.1కే రిజిస్ట్రేషన్.

8. రూ.20వేల లోపు డిపాజిట్లు చేసిన అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపులు చేయడానికి ఆమోదం

9. ఇసుక కొరతను తీర్చేందుకు చర్చలు. రోబో శాండ్ తయారీ యంత్రాల కొనుగోలు చేసేవారికి తక్కువ వడ్డీకే రుణాలు

10. ఎమ్మెల్యే బాలకృష్ణ వియ్యంకుడికి జగ్గయ్యపేటలో గత ప్రభుత్వం కేటాయించిన 498 ఎకరాల భూకేటాయింపులు రద్దు
First published: October 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...