భూమన కరుణాకర్ రెడ్డికి బంపర్ ఆఫర్ ఇచ్చిన సీఎం జగన్

భూమన కరుణాకర్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితులు. వైఎస్ హయాంలో టీటీడీ చైర్మన్‌గా కూడా పనిచేశారు.

news18-telugu
Updated: September 19, 2019, 9:01 PM IST
భూమన కరుణాకర్ రెడ్డికి బంపర్ ఆఫర్ ఇచ్చిన సీఎం జగన్
భూమన కరుణాకర్ రెడ్డి (File)
  • Share this:
తిరుపతి ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డికి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఓ అద్భుత అవకాశాన్ని ఇచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో ప్రత్యేక ఆహ్వానితుడినా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం ఏడుగురిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తే.. ఏపీ నుంచి ఒక్క భూమనకు మాత్రమే అవకాశం కల్పించారు. రాకేష్ సిన్హా (బీజేపీ ఎంపీ - న్యూఢిల్లీ), శేఖర్ (చెన్నై), కుపేందర్ రెడ్డి (బెంగళూరు), గోవింద హరి (హైదరాబాద్), దుష్మంత్ కుమార్ దాస్ (భువనేశ్వర్), అమోల్ కాలే (ముంబై)ను ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించింది. ఈ ఏడుగురు ప్రత్యేక ఆహ్వానితులుగా టీటీడీ బోర్డు సమావేశాలకు హాజరవుతారు. వారికి బోర్డు సభ్యులతో సమానంగా ప్రోటోకాల్ ఉంటుంది. అయితే, టీటీడీ పాలకమండలి తీర్మానాల విషయంలో వారికి ఎలాంటి ఓటు హక్కులు ఉండవని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. భూమన కరుణాకర్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితులు. వైఎస్ హయాంలో టీటీడీ చైర్మన్‌గా కూడా పనిచేశారు. చైర్మన్‌గా పనిచేసిన వ్యక్తికి బోర్డు సభ్యుడిగా పంపించకుండా ప్రత్యేక ఆహ్వానితునిగా అవకాశం కల్పించారు.
First published: September 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading