HOME »NEWS »POLITICS »ap cm ys jaganmohan reddy angry over fake propaganda by opposition on polavaram project ba bk

YS Jaganmohan Reddy: ఆ తప్పుడు ప్రచారంపై భగ్గుమన్న సీఎం జగన్

YS Jaganmohan Reddy: ఆ తప్పుడు ప్రచారంపై భగ్గుమన్న సీఎం జగన్
పోలవరం పర్యటనలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

పోలవరం 41.5 మీటర్ల తొలిదశలోనే మనం 120 టీఎంసీల నీటిని నిల్వచేస్తున్నామని, ఈ మేరకు ఆర్‌ అండ్‌ ఆర్‌ వెంటనే పూర్తవుతుందని స్పష్టం చేశారు. ఆ తర్వాత నిల్వ పెంచుకుంటూ.. ఆర్‌ అండ్‌ ఆర్‌ పనులు పూర్తిచేసుకుంటూ 45.72 మీటర్ల వరకూ వెళ్తామన్నారు.

 • Share this:
  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రతిపక్ష టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టును 2021 డిసెంబర్‌లోపు పూర్తి చేస్తామని, 2022 ఖరీఫ్ నాటికి పోలవరం నీళ్లు అందిస్తామని ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారంటూ టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని ఆయన తిప్పి కొట్టారు. పోలవరం పర్యటనలో భాగంగా తొలుత ఏరియల్‌ వ్యూ ద్వారా ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులను సీఎం జగన్‌ పరిశీలించారు. ముందుగా నిర్దేశించుకున్న ప్రకారం ఎఫ్‌ఆర్‌ఎల్ లెవల్‌ 45.72 మీటర్లు ఉంటుందని తెలిపారు. టాప్ ఆఫ్‌ మెయిన్ డ్యాం లెవల్‌ 55 మీటర్లు ఉంటుందని సీఎం జగన్‌ అన్నారు. డ్యామ్‌తో పాటు అదే వేగంతో పునరావాస కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఆర్థిక పరమైన అంశాలన్నీ పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. నిర్వాసితులకు న్యాయం చేస్తామని సీఎం జగన్‌ హామీ ఇచ్చారు.

  మహిళపై 17 మంది గ్యాంగ్ రేప్.. భర్తను కట్టేసి.. ఆమెను లాక్కెళ్లి  పరిటాల రవి కుటుంబం ఆశలపై నీళ్లు చల్లిన సీఎం జగన్

  Niharika Marriage: ఉదయ్ పూర్ కోటలో మహారాణిలా పెళ్లి చేసుకోవడానికి ఎంత ఖర్చవుతుంది?

  ‘డ్యాం కట్టడమే కాదు, అదే వేగంతో సహాయ పునరావాస కార్యక్రమాలూ చేపట్టడం కీలకం. ఆర్‌ అండ్‌ ఆర్‌ పట్టించుకోకపోవడంతో చిత్రావతి, గండికోట, కండలేరు డ్యాంలు కట్టినా సరే పూర్తిస్థాయిలో నిల్వ చేయలేకపోయాం. చిత్రావతి డ్యాం సామర్థ్యం 10 టీఎంసీలు. కానీ ఏరోజూ కూడా 3 టీఎంసీలు నింపలేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయాక ఆర్‌ అండ్‌ ఆర్‌ను పట్టించుకోలేదు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక రూ.240 కోట్లు ఇచ్చి 10 టీఎంసీలు నీటిని నిల్వచేశాం. గండికోట, కండలేరు విషయంలోకూడా అంతే. మనం వచ్చాక గండికోటలో 20 టీఎంసీల నీటిని నిల్వచేశాం. అందుకే పోలవరంలో కూడా ఆర్‌ అండ్‌ ఆర్‌కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. ప్రాధాన్యతా క్రమంలో ఆర్‌ అండ్‌ ఆర్‌ ఇచ్చుకుంటూ ముందుకు పోతాం’ అని జగన్ ప్రకటించారు.

  TATA Cars offers: డిసెంబర్‌లో టాటా కార్ల బంపర్ ఆఫర్.. డిస్కౌంట్ డబ్బులతో బైక్ కూడా కొనొచ్చు

  Jagananna Thodu: ‘జగనన్న తోడు’ పథకంలో డబ్బులు పొందాలంటే ఉండాల్సిన అర్హతలు, దరఖాస్తు విధానం

  ఇలాంటి లక్షణాలుంటే Demisexual అంటారు.. మీలో ఉన్నాయేమో చెక్ చేసుకోండి

  దేశంలో ఎక్కడ డ్యాం కట్టినా మొదట ఏడాదే నీటిని పూర్తిస్తాయిలో నిల్వచేయరని జగన్ చెప్పారు. భద్రతా నియమాలను పాటించాల్సి ఉంటుందన్నారు. మొదటి ఏడాది 33 శాతం, రెండో ఏడాది 50శాతం, మూడో ఏడాది పూర్తిస్థాయిలో నిల్వచేస్తారని తెలిపారు. సీడబ్ల్యూసీ నియమం దేశంలో ఉన్న అన్ని డ్యాంలకూ వర్తిస్తుందన్నారు. కానీ, పోలవరం 41.5 మీటర్ల తొలిదశలోనే మనం 120 టీఎంసీల నీటిని నిల్వచేస్తున్నామని, ఈ మేరకు ఆర్‌ అండ్‌ ఆర్‌ వెంటనే పూర్తవుతుందని స్పష్టం చేశారు. ఆ తర్వాత నిల్వ పెంచుకుంటూ.. ఆర్‌ అండ్‌ ఆర్‌ పనులు పూర్తిచేసుకుంటూ 45.72 మీటర్ల వరకూ వెళ్తామన్నారు.

  విమానంలో సెక్స్, అమ్మకానికి లో దుస్తులు.. సోషల్ మీడియాలో ఎయిర్ హోస్టెస్ దుమారం

  కరోనా కేసులు లేని ఏకైక పర్యాటక ప్రదేశం.. హనీమూన్ కోసం బెస్ట్ ప్లేస్

  కరోనా పెళ్లిళ్లలో కొత్త ట్రెండ్... వెబ్‌లో అక్షింతలు, అతిథుల ఇంటికే వివాహ భోజనం

  పోలవరం డ్యాం నిర్మాణంలో తలెత్తే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి ఒక కమిటీనికూడా ఏర్పాటు చేస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రి జగన్‌కు తెలిపారు. అందులో ఇరిగేషన్‌ అధికారులు, పీపీఏ, సీడబ్ల్యూసీకి చెందిన వారూ ఇందులో ఉంటారని వెల్లడించారు. డిజైన్లు, మోడళ్లు తదితర అంశాలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి ఈ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.
  Published by:Ashok Kumar Bonepalli
  First published:December 14, 2020, 15:34 IST