ఏపీలో అరుదైన సీన్.. జగన్, చంద్రబాబు ఇద్దరూ ఫారెన్ టూర్లోనే..

సీఎం జగన్ మోహన్ రెడ్డి తన కుటుంబంతో కలసి జెరూసలేం వెళ్తారు. ఇప్పటికే ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు అమెరికాలో పర్యటిస్తున్నారు.

news18-telugu
Updated: August 1, 2019, 10:15 PM IST
ఏపీలో అరుదైన సీన్.. జగన్, చంద్రబాబు ఇద్దరూ ఫారెన్ టూర్లోనే..
చంద్రబాబు, వైఎస్ జగన్
news18-telugu
Updated: August 1, 2019, 10:15 PM IST
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ అరుదైన దృశ్యం ప్రస్తుతం కనిపిస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఇద్దరూ రాష్ట్రంలో లేరు. ఇద్దరు తమ తమ కుటుంబాలతో విదేశాల్లో విహరిస్తున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి తన కుటుంబంతో కలసి ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లారు. యేసుక్రీస్తు జన్మస్థలమైన జెరూసలేంను జగన్ మోహన్ రెడ్డి కుటుంబం సందర్శిస్తుంది. ఆయన తిరిగి రావడానికి మరో నాలుగు రోజులు పడుతుంది. మరోవైపు ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇప్పటికే అమెరికాలో పర్యటిస్తున్నారు. తన ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఆయన అమెరికా వెళ్లారు. కుటుంబంతో కలసి అమెరికాలోనే ఉన్నారు. ఆయన తిరిగిరావడానికి మరికొన్ని రోజులు పడుతుంది. ఇన్నాళ్లూ తీరికలేని రాజకీయాలతో, మాటల యుద్ధాలతో బిజీ బిజీగా గడిపిన ఇద్దరు ముఖ్యనేతలు ఇప్పుడు తమ తమ కుటుంబాలతో సేదతీరుతున్నారు.

First published: August 1, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...