కిందపడ్డ పతకం స్వయంగా తీసిన సీఎం... భేషజం చూపని జగన్

పోలీస్ సీఎంకు సెల్యూట్ చేసి తిరిగి వెళ్తున్న సమయంలో ఆయన యూనిఫాంకు పెట్టిన పతకం జారి కింద పడిపోయింది.

news18-telugu
Updated: August 16, 2019, 11:21 AM IST
కిందపడ్డ పతకం స్వయంగా తీసిన సీఎం... భేషజం చూపని జగన్
కిందపడ్డ పతకాన్ని తీస్తున్న సీఎం జగన్
  • Share this:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్ తన ప్రవర్తనతో అందరి మనసు దోచుకుంటున్నారు. తాాజగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కూడా ఆయన ఎంత సింపుల్ సీఎం అందరికీ తెలిసేలా చేశారు. విజయవాడలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్... ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులకు, పోలీసులకు అవార్డుల్ని అందిస్తున్నాు. ఈ సందర్భంగా ఓ పోలీస్‌ అధికారికి ఆయన పతకం అలంకరించారు. అయితే ఆ పోలీస్ సీఎంకు సెల్యూట్ చేసి తిరిగి వెళ్తున్న సమయంలో ఆయన యూనిఫాంకు పెట్టిన పతకం జారి కింద పడిపోయింది. దాన్ని చూసిన సదరు పోలీస్ ఆఫీసర్ ముందుకు వెళ్లిపోగా.. సీఎం జగన్ వెంటనే... కిందకు వంగి ఆ పతకాన్ని స్వయంగా తీసి పక్కనే ఉన్న అధికారులకు అందించారు.

కిందపడ్డ పతకాన్ని తీస్తున్న సీఎం జగన్


సీఎం అంటేనే ఎంత సెక్యూరిటీ ఉంటుందో అందరికీ తెలిసిందే. సైగ చేస్తే వందమంది చుట్టూ చేరిపోతారు. ఏం కావాలన్న క్షణాల్లో సమకూర్చుతారు. కానీ తన చుట్టూ ఆదేశాలు అమలు చేసే అధికారులు ఉన్న వేళ, ఏ మాత్రం భేషజం చూపకుండా, కిందపడ్డ పతకాన్ని స్వయంగా చేత్తో తీసిన జగన్ అందర్నీ ఆశ్చర్య పరిచారు. . ఈ ఘటనకు సంబంధించిన వీడియో, ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.First published: August 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు