ఏపీ సీఎం వైఎస్ జగన్ రేపు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఏపీకి పరిపాలన రాజధానిగా విశాఖను ప్రకటించనున్న నేపథ్యంలో ఆయన నగరంలో పర్యటిస్తుండటం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోంది.
ఏపీ సీఎం వైఎస్ జగన్ రేపు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఏపీకి పరిపాలన రాజధానిగా విశాఖను ప్రకటించనున్న నేపథ్యంలో ఆయన నగరంలో పర్యటిస్తుండటం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోంది. విశాఖలో పర్యటించనున్న ఆయన జీవీఎంసీ, వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలో చేపట్టనున్న రూ.1,400 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. విజయవాడ నుంచి బయలుదేరి సీఎం రేపు మధ్యాహ్నం 3.10 గంటలకు విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. మధ్యాహ్నం 3.50 గంటలకు కైలాసగిరి మీదకు చేరుకుని వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు.
ఆ తర్వాత అక్కడి నుంచి 4.40 గంటలకు సెంట్రల్ పార్కుకు చేరుకుని జీవీఎంసీ ఆధ్వర్యంలో జరిగే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు ఆర్కే బీచ్‌కు చేరుకుని విశాఖ ఉత్సవ్‌ను ప్రారంభిస్తారు. 6 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడ నుంచి విజయవాడకు పయనమవుతారు.
Published by:Shravan Kumar Bommakanti
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.