నేడు కర్నూలులో సీఎం జగన్‌ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే

కర్నూలు పర్యటనలో ఎలాంటి అధికారిక కార్యక్రమాల్లోనూ సీఎం జగన్ పాల్గొనరు. కేవలం వివాహ వేడుకుకు హాజరయ్యేందుకు మాత్రమే వెళ్తున్నారు.

news18-telugu
Updated: February 27, 2020, 6:41 AM IST
నేడు కర్నూలులో సీఎం జగన్‌ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే
వైఎస్ జగన్మోహన్ రెడ్డి
  • Share this:
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. పత్తికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీదేవి కుమారుడి వివాహానికి సీఎం జగన్‌ హాజరుకానున్నారు. ఉదయం 10 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి.. మధ్యాహ్నం 01.20 వరకు తిరిగి నివాసానికి చేరుకోనున్నారు సీఎం జగన్. నేటి కర్నూలు పర్యటనలో ఎలాంటి అధికారిక కార్యక్రమాల్లోనూ సీఎం జగన్ పాల్గొనరు. కేవలం వివాహ వేడుకుకు హాజరయ్యేందుకు మాత్రమే వెళ్తున్నారు.

సీఎం జగన్ కర్నూల్ పర్యటన షెడ్యూల్:
ఉదయం 10.00 గంటలకు గన్నవరం విమానాశ్రయం ప్రత్యేక విమానంలో బయలుదేరి 10.40 గంటలకు ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకుంటారు.

10.50 గంటలకు అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్ట్టర్‌లో బయలుదేరి దిన్నెదేవరపాడు సమీపంలోని రాగమయూరి రిసార్ట్స్‌లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు 11.00 గంటలకు చేరుకుంటారు.11.05 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 11.10 గంటలకు రాగమయూరి రిస్టార్స్‌లోని ఫంక్షన్‌ హాల్‌కు చేరుకుంటారు.

అక్కడ 11.10 గంటల నుంచి 11.40 గంటల వరకు పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి కుమారుడి వివాహ వేడుకలో పాల్గొంటారు.

అనంతరం 11.40 గంటలకు అక్కడి నుంచి బయలు దేరి 11.45 గంటలకు హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.11.50 గంటలకు అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 12.00 గంటలకు ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకుంటారు.

12.10 గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరి 12.50 గన్నవరం విమానాశ్రయానికి సీఎం చేరుకుంటారు.

1.00 గంటకు అక్కడి నుంచి బయలు దేరి 1.20 గంటలకు సీఎం నివాసానికి చేరుకుంటారు.
First published: February 27, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు